
రైల్వే స్టేషన్లలో డీఆర్‌ఎం తనిఖీ
రాయచూరు రూరల్: దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్త శనివారం యాదగిరి, రాయచూరు, మటమారి, మంత్రాలయం రైల్వే స్టేషన్లను పరిశీలించారు. నగరంలోని రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యరమరస్ రైల్వే స్టేషన్ ఇంచార్జి స్టేషన్ మాస్టర్ సర్కార్, ఇతర అధికారులున్నారు.
నగర వీధుల్లో పోలీసు కవాతు
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో ఈనెల 19న జరగనున్న మహా గణపతి నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రధాన వీధుల్లో పోలీసులు కవాతు జరిపారు. శనివారం ఎస్పీ కార్యాలయం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసు కవాతు నిర్వహించారు. కవాతులో ఎస్పీ పుట్ట మాదయ్య, పోలీసు అధికారులు కుమారస్వామి, శాంతవీర, హరీష్, మేకా నాగరాజ్, ఉమేష్ కాంబ్లే, ఈరణ్ణ, నరసమ్మ, లక్ష్మి, శారదలున్నారు.