
పంటలకు గరిష్ట ధరలు కల్పించాలి
రాయచూరు రూరల్: వ్యవసాయ రంగంలో రైతులకు గరిష్ట ధరలు లభించేలా చూస్తామని వ్యవసాయ ధరల కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ దళవాయి పేర్కొన్నారు. శనివారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సంవాద కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పరిశ్రమల కేంద్రం వారు నిర్ణయించిన విధంగా ధరలను రైతులకు సరైన మార్కెట్ వ్యవస్థ లేక పోవడం వల్ల రైతులు నష్టాల బాటలో పయనిస్తున్నారన్నారు. వ్యవసాయం ప్రకృతి పరంగా ఆధార పడిన రంగమన్నారు. కేంద్రం నిర్ణయించిన ధరల కంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే ధరలు ప్రధానమన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హన్మంతప్ప, డీహెచ్ పూజార్, రైతులున్నారు.