
తప్పని వాన కష్టాలు
రాయచూరు రూరల్: రాయచూరు, లింగసూగూరుల్లో భారీ వర్షం కురిిసింది. శనివారం మధ్యాహ్నం గోడ గడియారం, బస్టాండ్ రహదారిలో వర్షపు నీరు ప్రవహించింది. ఎక్కడ చూసినా రహదారులు నీటి గుంటలుగా మారాయి. అంబేడ్కర్ సర్కిల్, టిప్పు సర్కిల్, కసబా లింగసూగూరు, గాంధీ చౌక్, పోలీస్ స్టేషన్ చౌక్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లోకి, ఇళ్లలోకి వర్షపు నీరు చొరబడ్డాయి. వాటిని తొలగించడానికి మహిళలు నానా తంటాలు పడ్డారు.
నా ఓటు, నా హక్కుపై
15న ప్రజా అవగాహన
హొసపేటె: అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఈనెల 15న వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ నోంగ్‌జాయ్ మహ్మద్ అలీ అక్రమ్ షా అన్నారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ ముందస్తు సమావేశంలో ఆయన మాట్లాడారు. నా ఓటు, నా హక్కు అనే నినాదంపై అవగాహనకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ఏడీసీ ఈ.బాలకృష్ణప్ప, ఏఎస్పీ టి.మంజునాథ్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వై ఎం.కాళె, అసిస్టెంట్ కమిషనర్ పీ.వివేకానంద, తహసీల్దార్ శృతి, డీడీపీయూ నాగరాజ్ హవల్దార్, ఎస్టీ సంక్షేమ అధికారి కే.రవికుమార్ పాల్గొన్నారు.