
సైబర్ మోసాల జోరు
సైబర్ వంచకులు బ్యాంకు ఖాతాలకు కన్నాలు వేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో బాధితులు సహాయవాణికి ఫోన్ చేసి లబోదిబోమంటున్నారు.
బనశంకరి: సైబర్‌వంచకుల హవా రాష్ట్రంలో ఏడాది నుంచి ఏడాదికి పెచ్చుమీరుతూనే ఉంది. దీంతో రాష్ట్ర కేంద్ర సైబర్‌క్రైం పోలీస్ విభాగం వంచకులపై ప్రత్యేక నిఘా పెట్టింది. 80 శాతం వంచన బెంగళూరు నగరంలోనే జరుగుతోంది. సైబర్ వంచన బారిన పడిన వారిలో చాలామంది విద్యావంతులు, విశ్రాంత అధికారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఆన్‌లైన్, వివిధ ప్రైవేట్ యాప్‌లను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడం, సోషల్ మీడియాలో ప్రకటనలు, డిజిటల్ అరెస్ట్‌తో ఎక్కువ డబ్బు పోగొట్టుకుంటున్నారు.
ఫిర్యాదులకు సహాయవాణి
సైబర్ కేటుగాళ్ల చేతిలో ప్రజలు వంచనకు గురౌతున్న నేపథ్యంలో ఫిర్యాదు చేయడానికి 1930 నంబర్‌తో సైబర్ నేరాల సహాయవాణి, వెబ్‌చాట్ యాప్‌ను రూపొందించగా ఫిర్యాదుదారులు ఫోన్‌కాల్స్ చేసే వారి సంఖ్య పెరిగింది. మోసం జరిగిన గంటల వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులు పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీనినే గోల్డెన్ అవర్ అంటారు.
ఫోన్‌కాల్స్ వెల్లువ
రాష్ట్రంలో సైబర్ సహాయవాణి– 1930కు గత ఏడాదిన్నరలో ప్రజల నుంచి 17.50 లక్షల ఫోన్‌కాల్స్ అందగా వంచనకు గురైన మొత్తం రూ.3,334 కోట్లను దాటినట్లు వెల్లడైంది. 2024లో సైబర్ సహాయవాణి కేంద్రానికి 10,79,458 ఫోన్‌కాల్స్ చేయగా ప్రస్తుత ఏడాది మే చివరి నాటికి సుమారు 6,71,365 ఫోన్‌కాల్స్‌తో మొత్తం 17,50,823 ఫోన్‌కాల్స్ చేశారు. వంచన మొత్తం 2024లో రూ.2,396 కోట్లు కాగా ఈ ఏడాది 2025లో 5 నెలల్లో రూ.938 కోట్లు సైబర్ వంచకుల పాలైనట్లు హోంశాఖ నివేదికలో వెల్లడైంది.
సైబర్ హెల్ప్‌లైన్–1930కు
17 లక్షల ఫోన్‌కాల్స్
రూ.3,334 కోట్ల వంచన,
వెబ్‌చాట్ లింక్‌లో ఫిర్యాదు

సైబర్ మోసాల జోరు

సైబర్ మోసాల జోరు