మూడు జిల్లాల్లో వర్ష బీభత్సం
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలోని మూడు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానలు బీభత్సవం సృష్టించాయి. రాయచూరు జిల్లా గుడదిన్నిలో సాయణ్ణ(55), లక్ష్మమ్మ(70) పిడుగుపాటుకు గురై మరణించారు. దేవదుర్గ తాలూకా నాగడదిన్ని, సిరవార, మస్కి తాలూకా మెదికినాళ, మాన్వి తాలూకా కాతరకి, లింగసూగూరు తాలూకా పామనకల్లూరు, రాయచూరు తాలూకా యరగేర, గుంజళ్లి, బూడిదపాడు, ఆత్కూరు, సంగంకుంట, యాదగిరి జిల్లా శహాపుర, కలబుర్గి జిల్లా కమలాపురల్లో భారీ వర్షాలు కురిశాయి. వరి, మిరప, మామిడి పంటలు దెబ్బ తిన్నాయి. ఆత్కూరు, బూడిదపాడులో 150 మామిడి చెట్లు, ఽశహాపురలో వెయ్యి ఎకరాల్లో మిరప పంట, 4500 ఎకరాల్లో వరి పైరు నాశనమైంది. 450 ఎకరాల్లో సాగు చేసిన అరటిపంటకు నష్టం వాటిల్లింది.
ఇద్దరు దుర్మరణం
పంటలకు భారీ నష్టం
లేచి పోయిన టిన్ షెడ్లు
మూడు జిల్లాల్లో వర్ష బీభత్సం
మూడు జిల్లాల్లో వర్ష బీభత్సం


