భీమ అమావాస్య పూజలు | - | Sakshi
Sakshi News home page

భీమ అమావాస్య పూజలు

Aug 6 2024 1:06 AM | Updated on Aug 6 2024 1:06 AM

భీమ అ

భీమ అమావాస్య పూజలు

గౌరిబిదనూరు: మంచేనహళ్ళి సమీపంలో ఉన్న బాక్కలహళ్ళి గ్రామంలో వెలసిన పురాతన శివాలయంలో ఆదివారం భీముని అమావాస్య పూజలను నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి భక్తులే వచ్చి రుద్రునికి అభిషేకాలు నిర్వహించారు. రుద్రహోమం, రుద్రాభిషేకం, గంగపూజ ఇతర ప్రత్యేక పూజలు ధర్మకర్త బికె మంజునాథ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు ఫల పుష్ప నైవేద్యాలు సమర్పించి శివయ్యకు మొక్కులు తీర్చుకొన్నారు.

ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై స్పెషల్‌ డ్రైవ్‌

రూ.10 లక్షల జరిమానా వసూలు

యశవంతపుర: బెంగళూరులో ట్రాఫిక్‌ ఉల్లంఘనులను నియంత్రించేందుకు పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఈస్ట్‌ డివిజన్‌ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంగించిన 2100 మందిపై కేసులు నమోదు చేసి రూ. 10.63 లక్షల జరిమానా వసూలు చేశారు. ఆదివారం ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి సిగ్నల్‌ జంపింగ్‌, రాంగ్‌ పార్కింగ్‌, ఫుట్‌పాత్‌ పార్కింగ్‌, త్రిబుల్‌రైడింగ్‌, డ్రైవింగ్‌లో మొబైల్‌ వాడటంపై తదితర వాటిపై కేసులను నమోదు చేసి రూ. 10.53 లక్షల జరిమానా వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జూలో సింహం కన్నుమూత

శివమొగ్గ: శివమొగ్గ శివార్లలోని త్యావరెకొప్పలోని జూ లో మగ సింహం మరణించిన ఘటన సోమవారం జరిగింది. 18 ఏళ్ల వయస్సు కలిగిన ఆర్య అనే సింహం లయన్‌ సఫారిలో ఉండేది. వయసు పెరిగిపోవడంతో కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆహారం కూడా తీసుకోలేకపోతోంది. 2008లో మైసూరు జూ నుంచి ఆర్యను ఇక్కడికి తీసుకొచ్చారు. సఫారీలో ఇంకా నాలుగు సింహాలున్నాయి.

ఎస్‌ఐ మృతి కేసు సీఐడీకి

హోం మంత్రి పరమేశ్వర్‌

దొడ్డబళ్లాపురం: యాదగిరి సబ్‌ఇన్స్‌పెక్టర్‌ పరశురాం మృతి కేసును సీఐడీకి అప్పగించామని, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హోం మంత్రి జీ పరమేశ్వర్‌ తెలిపారు. సదాశివనగర్‌లోని ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. రిపోర్టు వచ్చాక ఎలా మృతి చెందారో తెలిసే అవకాశం ఉందన్నారు. బుధవారం పరశురాం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానని తెలిపారు. కుటుంబానికి పరిహారం ఇస్తామన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమారుడి విషయం మాట్లాడుతూ, ఈ కేసును ఇప్పటికే సీఐడీకి అప్పగించామని అన్నారు.

ప్రియురాలిని

అంతమొందించి.. ఆత్మహత్య

మండ్య జిల్లాలో విషాదం

మండ్య: ప్రేమను నిరాకరించిన యువతిని మచ్చు కత్తితో నరికి చంపిన భగ్న ప్రేమికుడు, ఆపై బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని మండ్య జిల్లా నాగమంగల తాలూకా దేవలాపుర ఫిర్కా సునగనహళ్లి వద్ద జరిగింది. మండ్య తాలూకాలోని హొసహళ్లి గ్రామానికి చెందిన శరత్‌ (30) అనే యువకుడు, అంచహళ్లి గ్రామంలోని అవ్వాతాతల ఇంటిలో ఉండేవాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ఆరేడేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల ఆ యువతి శరత్‌కు బ్రేకప్‌ చెప్పేసింది. దీంతో ఆగ్రహావేశానికి గురైన శరత్‌ ఆ యువతిపై మచ్చుకత్తితో దాడి చేశాడు, తీవ్ర గాయాలతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తరువాత మొబైల్‌ను స్విచాఫ్‌ చేసుకుని నాగమంగల తాలూకా సునగనహళ్లి సమీపంలోని పొలంలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ రవికుమార్‌, పోలీసులు బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీయించి ఆదిచుంచనగిరి ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

భీమ అమావాస్య పూజలు 1
1/2

భీమ అమావాస్య పూజలు

భీమ అమావాస్య పూజలు 2
2/2

భీమ అమావాస్య పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement