ప్రేమజంటకు పెద్దల బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రేమజంటకు పెద్దల బ్రేక్‌

Feb 21 2024 1:08 AM | Updated on Feb 21 2024 7:29 AM

పద్మజ, ప్రవీణ్‌  - Sakshi

పద్మజ, ప్రవీణ్‌

సాక్షి, బళ్లారి: కూతురు మరో కులం యువకున్ని ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపగించుకున్న తల్లిదండ్రులు వారి రిజిస్టర్‌ పెళ్లిని అడ్డుకున్న ఘటన చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా బీజీకెరెలో జరిగింది. వివరాలు.. బీజీకెరె గ్రామానికి చెందిన ప్రవీణ్‌, పద్మజ అనే ఇద్దరు ఐదేళ్ల నుంచి ప్రేమించుకుని గత వారం క్రితం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

అయితే కులాలు వేర్వేరని వారి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. ప్రేమికులిద్దరూ మంగళవారం రిజిస్టర్‌ పెళ్లి చేసుకోవాలని మొళకాళ్మూరుకు బయల్దేరారు. ఇంతలో పద్మజను వారి బంధువులు అడ్డుకుని బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లారు.

ఈ వీడియో వైరల్‌ అయింది. బీజీకెరె గ్రామానికి చెందిన ప్రవీణ్‌నాయక్‌ ఎస్టీ అయితే, కోనసాగర గ్రామానికి చెందిన పద్మజ బీసీ కులం యువతి. పద్మజ మంగళూరు నర్సింగ్‌ కళాశాలలో అతిథి లెక్చరర్‌గా పని చేస్తుండేది. ఆమె బంధువులు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రవీణ్‌ ఆరోపించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement