డిమాండ్లను తీర్చాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

డిమాండ్లను తీర్చాలని ధర్నా

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

హొసపేటె: ఆశా కార్యకర్తల సమస్యలను తీర్చాలని కోరుతూ జిల్లా ఆరోగ్యాధికారి కార్యాలయం ముందు మంగళవారం నిరసన చేపట్టారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రమోద్‌ మాట్లాడుతూ 4 నెలలుగా జీతం లేకపోవడంతో ఆశా కార్యకర్తల పరిస్థితి కష్టంగా మారిందన్నారు. వారు తమ కుటుంబాలను పోషించుకోలేక పోతున్నారన్నారు. అనంతరం జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్‌ లింగరాజు మాట్లాడుతూ గత మే నుంచి జూలై వరకు ప్రోత్సాహక వేతనం ఖజానాకు చేరింది. మరికొన్ని రోజుల్లో ఆశా కార్యకర్తల ఖాతాలో వేతనం జమ అవుతుందన్నారు. ఆందోళనలో ఉపాధ్యక్షురాలు మహేశ్వరి, నేత్రావతి, అన్నపూర్ణ, గౌరీ, శాంతమ్మ, రుక్మిణి, బసమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement