రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఉత్తర, కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో తీవ్ర కరువు సంభవించినందున సన్న, చిన్న కారు రైతులు, ప్రజల హక్కుల రక్షణకు ప్రజా పోరాటాన్ని బలోపేతం చేయాలని సీపీఐ ఎంఎల్(రెడ్‌స్టార్) జాతీయ ప్రధాన కార్యదర్శి జేమ్స్ పిలుపునిచ్చారు. బుధవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో ఏర్పాటు చేసిన సీపీఐ ఎంఎల్(రెడ్‌స్టార్) 13వ సమావేఽశంలో ఆయన మాట్లాడారు. ఈపెల 16 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న 13వ జాతీయ స్థాయి సమావేశాల్లో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, కెన్యా, కుర్ధిస్థాన్‌తో పాటు 14 దేశాల నుంచి నేతలు, అధ్యక్షుడు మానసయ్య, జోసెఫ్, రుద్రయ్య, అంజన ఆజాద్, బసవరాజ్, రవీంద్రనాథ్ పట్టిలున్నారు.


