బళ్లారి రూరల్ : జిల్లా మహిళా శిశు సంమశాఖలో దేవదాసి యోజనాధికారి నియామకం చేపట్టాలని కర్ణాటక రాష్ట్ర దేవదాసి మహిళా విమోచన సంఘం తోరణగల్లు శాఖ మహిళలు బుధవారం డీసీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. జిల్లా కార్యదర్శి ఏ.స్వామి మాట్లాడుతూ బళ్లారి, విజయనగర జిల్లాలకు సుధా చిద్రికి దేవదాసి యోజనాధికారిగా అదనపు బాధ్యతను అప్పగించారు. రెండు జిల్లాలకు ఒకరే అధికారి కావడంతో ధృవీకరణ పత్రాలు, పెన్షన్లు, సమస్యలు పరిష్కరించడంలో తీవ్రం జాప్యం జరుగుతోందన్నారు. ధర్నాలో సంఘం ప్రముఖులు ఈరమ్మ, దుర్గమ్మ, వీరేశ్, పార్వతి పాల్గొన్నారు.


