అభివృద్ధికి గ్రహణం వీడేదెన్నడో? | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి గ్రహణం వీడేదెన్నడో?

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

రాయచూరు రూరల్‌: ప్రాంతీయ అసమానతలతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్రంలో గతంలో హైదరాబాద్‌–కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి(హెచ్‌కేఆర్‌డీబీ)ని ఏర్పాటు చేశారు. విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాల్లో ఇతర ప్రాంతాలతో సమానంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన మండలి పేరుకు మాత్రమే పరిమితమైంది. అనంతరం హైదరాబాద్‌ కర్ణాటక కల్యాణ కర్ణాటకగా రూపాంతరం చెందింది. కల్యాణ కర్ణాటక పరిధిలో బీదర్‌, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలు వస్తాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన సర్కార్లు ఈ ప్రాంతాభివృద్ధి కోసం బడ్జెట్‌లో ప్రతి ఏటా రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తాయి. ఈ నిధులను శాసన సభ్యులు రహదారులు, పాఠశాలలు, తాగునీటి పథకాలు తదితర అభివృద్ధి పనులకు వినియోగించుకోవాల్సి ఉంది. ప్రత్యేక కమిషనరేట్‌ కార్యాలయం ఏర్పాటు హుళక్కే అయింది. 1957 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ నిజాంల పాలన నుంచి కల్యాణ కర్ణాటక ప్రాంతానికి విముక్తి కలిగింది. స్వాతంత్య్రం లభించి 69 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 2001లో అప్పటి ముఖ్యమంత్రి ఎస్‌ఎం.కృష్ణ హెచ్‌కేఆర్‌డీబీని స్థాపించి అభివృద్ధికి ప్రాముఖ్యత నిచ్చారు. కల్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలికి శాసన సభ్యుడు అధ్యక్షుడిగా కొనసాగుతారు.

నేడు సీఎం శివకుమార్‌ కలబుర్గి రాక

ముఖ్యమంత్రి ఈకే శివకుమార్‌ గురువారం కలబుర్గిలో జరిగే కళ్యాణ కర్ణాటక విమోచన దినోత్సవ వేడుకలతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముందుగా ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌బాయి పటేల్‌ ప్రతిమకు పుష్పార్చన చేస్తారు. అనంతరం కలబుర్గి క్రీడా మైదానంలో జరిగే కళ్యాణ కర్ణాటక విమోచన దినోత్సవంలో జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు.

గత ఐదేళ్లలో రూ.5 వేల కోట్ల నిధులు కేటాయింపు

ప్రత్యేక కమిషనరేట్‌ కార్యాలయం ఏర్పాటు హుళక్కే

నేడు కల్యాణ కర్ణాటక విమోచన దినోత్సవ వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement