బైక్‌ను ఈడ్చుకెళ్లిన లారీ.. నవ దంపతులు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

3 నెలల కిందటే మూడుముళ్లు

Dec 5 2023 5:04 AM | Updated on Dec 5 2023 8:26 AM

- - Sakshi

భార్యతో కలిసి ఆదివారం సెలవు రోజు కావడంతో తన అత్తవారి ఇంటికి స్వగ్రామైన కల్లురొప్పం నుంచి బైక్‌పై బయలుదేరారు.

తుమకూరు: తుమకూరు జిల్లా మధుగిరి తాలుకా దాసరహళ్లి గ్రామ సమీపాన ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీరంగప్ప (35), భార్య సుమ (26) అనే నవదంపతులు దుర్మణం చెందారు.

వివరాల్లోకి వెళితే గుడిబండ మండలం మోరుబాగల్‌ సచివాలయంలో విలేజ్‌ సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీరంగప్ప, భార్యతో కలిసి ఆదివారం సెలవు రోజు కావడంతో తన అత్తవారి ఇంటికి స్వగ్రామైన కల్లురొప్పం నుంచి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలోని దాసరహళ్లి సమీపానికి వెళ్లగానే ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొని సుమారు 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. భర్త శ్రీరంగప్ప అక్కడికక్కడే మృతి చెందగా భార్య తుమకూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.

3 నెలల కిందటే మూడుముళ్లు
మూడు నెలల క్రితమే శ్రీరంగప్పకు పెళ్లి జరిగింది. నవదంపతుల మృతితో కల్లురొప్పంలో విషాదం అలుముకొంది. సోమవారం కల్లురొప్పంలో ఇరువురికీ అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సచివాలయం సిబ్బంది నివాళులు అర్పించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement