అక్కాతో వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్య..  | A Man Commits Suicide In Karnataka's Bengaluru - Sakshi
Sakshi News home page

అక్కాతో వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్య.. 

Aug 21 2023 1:50 AM | Updated on Aug 24 2023 10:57 AM

- - Sakshi

కర్ణాటక: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే మోసం చేసిందనే ఆవేదనతో భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. బీబీఎంపీలో పౌర కార్మికుడిగా పని చేస్తున్న లోకేశ్‌ చిక్కమారనహళ్లిలో నివాసం ఉంటున్నాడు. 11 ఏళ్ల క్రితం శశికళ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దంపతులకు ఇద్దరు చిన్నారులున్నారు. ఇతనికి చిరంజీవి అనే స్నేహితుడు ఉన్నాడు.

శశిళకళను అక్కా అక్కా అని పిలిచేవాడు. అయితే శశికళ, చిరంజీవి సన్నిహితంగా ఉండటాన్ని గమనించి లోకేష్‌ షాకయ్యాడు. శశికళ తనను మోసం చేసిందనే బాధతో తోట వద్దకు వెళ్లాడు. శశికళ చేసిన మోసాన్ని సూసైడ్‌ నోట్‌ రాసి ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కొడుకు వస్తాడని తల్లి ఎదురు చూస్తుండగా పెంపుడుకుక్క లోకేశ్‌ విగతజీవిగా ఉన్న చోటుకు తీసుకెళ్లింది. నెలమంగల గ్రామాంతర పోలీసులు వచ్చి మృతదేహాన్ని, ఘటన స్థలంలో పడి ఉన్న సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement