బనశంకరి: దేశ వ్యాప్తంగా ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతుండగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టికెట్ల కోసం పడిగాపులు కాసిన టికెట్లు చిక్కలేదని అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం వద్ద అభిమానులు గొడవ చేస్తున్నారు. ఒక టికెట్ రూ. 9 వేలు చెబుతున్నారని, గురువారం రాత్రి నుంచి గంటలకొద్ది వేచి ఉన్నా టికెట్లు దక్కలేదని మండి పడుతున్నారు.
రాయచూరు, కొప్పళ, బళ్లారి, బీదర్, గుల్బర్గ, యాదగిరి, హుబ్లీ నుంచి క్రికెట్ అభిమానులు తరలివచ్చి టికెట్లు కోసం గంటల కొద్ది వేచి ఉంటున్నారు. గురువారం రాత్రి నుంచి టికెట్ల కోసం క్యూలో నిలబడితే 150 టికెట్లు మాత్రమే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ విషయంలో మోసం చేస్తున్నారని మేనేజ్‌మెంట్‌పై అభిమానులు మండిపడుతున్నారు.


