కార్మికులకు అండ | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు అండ

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

ఉద్యమాలు, ఉత్పత్తిలోనూ సింగరేణి కార్మికులే మొనగాళ్లు

తెలంగాణ సాధనలో శ్రామికుల పోరాటం మరువలేనిది

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు

సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభ విజయవంతం

గులాబీ జెండానే

సాక్షి పెద్దపల్లి/గోదావరిఖని:

బొగ్గు ఉత్పతితోపాటు ఉద్యమాల్లోనూ సింగరేణి కార్మికులే మొనగాళ్లని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభివర్ణించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించే కార్మికులు తెలంగాణ సాధనలోనూ సత్తా చాటారని ప్రశంసించారు. గోదావరి ప్రాంత ప్రజలు, సింగరేణి కార్మికులు ఉద్యమంలో చూపిన ఐక్యత, పోరాట పటిమ స్వరాష్ట్ర సాధనలో కీలకంగా నిలిచాయన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను కొనసాగిస్తే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రు ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. వాటా లు, బేరాలు కుదరకపోవడంతోనే నైనీ బొగ్గు బ్లాక్‌ టెండర్లు రద్దయ్యాయని కేటీఆర్‌ ఆరోపించారు.

సకలజనుల సమ్మెలో కీలకపాత్ర

సకలజనుల సమ్మెలో ఒకసారి 35 రోజులు, మరో సారి ఏడురోజులు కలిపి మొత్తం 42 రోజుల పాటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయేలా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని గుర్తుచేశారు. దీంతో దక్షిణ భారతదేశంలో విద్యుత్‌ సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆమరణ దీక్ష సమయంలోనూ కార్మికులు ఏడు రోజుల పాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు.

గోదావరిఖని బిడ్డ.. మస్తు తీసిండు..

శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్‌ సినిమా’లో కేసీఆర్‌ పాత్రను అద్భుతంగా చూపించారని కేటీఆర్‌ ప్రశంసించారు. అణచివేతకు గురైన జాతి ఎలా తిరగబడుతుంది, ఆ పోరాటానికి నా యకత్వం వహించే నేత ఎలా ప్రజలను ఏకం చేసి విజయాన్ని సాధిస్తారు? అనే అంశాలను గోదావరిఖని బిడ్డ శ్రీకాంత్‌ ఓదెల చాలా చక్కగా చిత్రీకరించారని ప్రశంసలు కురిపించారు. బహిరంగసభలో నాయకులు జీవన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, గండ్ర సత్యనారాయణ, కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్య, మధుసూదనాచారి, కౌశిక హరి, వ్యాళ్ల హరీశ్‌రెడ్డి, జాన్సన్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement