కరీంనగర్కల్చరల్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో బుధవారం అమ్మవారు మహాచండీదేవీ (కూష్మాండ) అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని పసుపుకొమ్ములతో అలంకరించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్, వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో దాండియాతో యువత హోరెత్తించారు. శక్రవారం ఆలయంలో సరస్వతి పూజ ఉంటుందని, రాత్రి నిర్వహించే దాండియాలో పాల్గొనే భక్తులు రెడ్ కలర్ డ్రెస్ కోడ్తో రావాలని ఆలయ నిర్వాహకులు సూచించారు.


