కరీంనగర్‌టౌన్: గంగాధర మండలం ఒద్యారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు స్వచ్ఛత, వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివద్ధి విభాగాల్లో ఎస్‌హెచ్‌వీఆర్ 2025–26 ఏ డాదికి జాతీయ గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా 190 పాఠశాలల్లో 23వ ర్యాంకు సాధించగా, తెలంగాణ నుంచి ఎంపికై న 10 పాఠశాలల్లో చోటు దక్కించుకుంది. జాతీయస్థాయి సత్కారం, ప్రశంసాపత్రంతో పాటు అభివృద్ధికి రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. ఈ మేరకు మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు ఈ.శ్రీనివాస్, మాజీ ఎంఈవో ఎనుగు ప్రభాకర్‌రావును అభినందించారు. టీపీయూఎస్ అధ్యక్షుడు ఏ.తిరుపతిరావు, కనకోటి హరిచరణ్, బుర్ర నాగరాజ్, ద్యావనపల్లి శ్రీకాంత్‌రావు పాల్గొన్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. 11 కే.వీ అల్కాపురి ఫీడర్ పరిధిలో 10 గంటల నుంచి 10.30 గంటల వరకు అల్కాపురి కాల నీ, జేఏఎస్ బేకరీ, నాగుల ఎల్లమ్మ టెంపుల్, గిద్దె పెరుమాండ్ల ఆలయం, సవరణ్ స్కూల్ స్ట్రీట్, ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు 11 కేవీ మిషన్ భగీరథ ఫీడర్, ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫిల్టర్‌బెడ్ ఫీడర్ పరిధిలోని ప్రాంతాలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్ఎస్–10 పరిధిలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతం, ఎస్ఎస్–39 పరిధి లోని జిల్లా గ్రంథాలయ ప్రాంతం, ఎస్ఎ స్–88 పరిధిలోని ఫైర్ స్టేషన్ ప్రాంతం, కోటక్ బ్యాంక్ ప్రాంతం, ఐసీఐసీఐ బ్యాంక్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.
23న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇంటర్వ్యూలు
కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వాక్ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ తఖీయుద్దీన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ తదితర పోస్టులకు ఈ నియామకాలు చేపట్టనున్నారు. అర్హులైన అభ్యర్థులు కళాశాల అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని, పూర్తి వివరాలతో రెండు సెట్ల నకళ్లు, రెండు సెట్ల ఫొటోలతో ఈ నెల 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఖాళీల సమాచారం ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. నియామకాలు మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
బల్దియా అధికారులకు విధులు కేటాయింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ అధికారులకు విధులు కేటాయిస్తూ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అదనపు కమిషనర్ సువార్తకు ఎంసీకే ప్రజావాణి, మెప్మా, మరో అదనపు కమిషనర్ ఆయాజ్‌కు ఎస్టాబ్లిష్మెంట్, ఇందిరమ్మ ఇండ్లు పర్యవేక్షణ, కోర్టుకేసులు, న్యాయవ్యవహారాలు, శానిటేషన్ పర్యవేక్షణ,హెల్త్ సెక్షన్, ట్రేడ్‌లైసెన్స్, డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్‌కు డివిజన్ల వారీగా రెవెన్యూ, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, సెన్సెస్ అప్పగించారు. మరో డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్‌కు డివిజన్ల వారీగా రెవెన్యూ, సిటీ శానిటేషన్, ట్రేడ్‌లైసెన్స్, ఏబీసీ, డంప్‌యార్డ్, డీఆర్సీ, కంపోస్ట్, బల్దియా వాహనాల డీజిల్, ఆయిల్ నిర్వహణ, ఆర్టీఐ, కలెక్టరేట్ ప్రజావాణి, కౌన్సిల్, సహాయ కమిషనర్ రాజ మనోహర్‌కు రికార్డు రూమ్, సిటిజన్ సర్వీస్ సెంటర్, ఆడిట్ అభ్యంతరాలు, ప్రజాపాలన, సీఎం ప్రజావాణి, ఎంసీకే ప్రజావాణి ఏర్పాట్లు, పెన్షన్ విధులు కేటాయించారు.
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో పత్తి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. బుధవారం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.9,200 పలికింది. మార్కెట్‌కు 120 వాహనాల్లో 735 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.8,800, కనిష్ట ధర రూ.8,000కు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.


