● కాలువ నీటి విడుదలకు బీఆర్‌ఎస్‌, బీజేపీ ఆందోళన ● రేవెల్లి వద్ద షట్టర్‌ ఎత్తిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ | - | Sakshi
Sakshi News home page

● కాలువ నీటి విడుదలకు బీఆర్‌ఎస్‌, బీజేపీ ఆందోళన ● రేవెల్లి వద్ద షట్టర్‌ ఎత్తిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

● కాలువ నీటి విడుదలకు బీఆర్‌ఎస్‌, బీజేపీ ఆందోళన ● రేవెల్లి వద్ద షట్టర్‌ ఎత్తిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

చొప్పదండి/కరీంనగర్‌రూరల్‌: ఎస్సారెస్పీ కాలువ నీటి విడుదల కోసం బీఆర్‌ఎస్‌, బీజేపీ బుధవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వానాకాలం సాగు చేసిన పంటలు వర్షాభావ పరిస్థితులతో ఎండిపోతుండటంతో పంటల ను కాపాడేందుకు ప్రభుత్వం మూడు రోజుల క్రితం ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసింది. ప్రవాహం తక్కువగా ఉండడంతో ముందుగా పెద్దపల్లి జిల్లాకు నీరు విడుదల చేసిన అధికారులు కరీంనగర్‌ మండలానికి నిలిపివేశారు. నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తో బుధవారం నగునూరులో రాస్తారోకో చేయాలని బీజేపీ నిర్ణయించగా, పోటీగా బీఆర్‌ఎస్‌ రేవెల్లి ముట్టడికి పిలుపునిచ్చింది. బీజేపీ నాయకులు నగునూరులో రాస్తారోకో చేపట్టిన అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకుల కన్నా ముందుగానే రేవెళ్లికి చేరుకున్నారు. చొప్పదండి శివారులోని శివకేశవాలయం సమీపంలోని కాలువపై ఉన్న షట్టర్‌ను బీజేపీ జిల్లా ప్రదాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో తెరిచారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. ఇంతలో కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. ఎస్సారెస్పీ అధికారులతో నీటిని విడుదల చేయాలని సూచించారు. లేకుంటే కాలువలో దూకుతానని హెచ్చరించారు. షట్టర్‌ను పైకిలేపి డీ–86 ద్వారా కరీంనగర్‌ మండలానికి నీటిని విడుదల చేశారు. కమలాకర్‌ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా రైతులకే పంటలు ఉన్నాయా, తమ రైతులకు లేవా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెళ్లాక అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. మొత్తానికి కాలువ నీటిని తామే విడుదల చేశామనే క్రెడిట్‌ పొందడానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ చేసిన ఆందోళన కార్యక్రమాలపై అధికార కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement