సద్దులకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సద్దులకు ఏర్పాట్లు

Oct 14 2026 4:23 AM | Updated on Oct 14 2026 4:23 AM

● కలెక్టర్‌ చిత్రా మిశ్రా

● కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లాలో సద్దుల బతుకమ్మ పండుగకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. బతుకమ్మ ఏర్పాట్లపై వివిధశాఖల అధికారులతో మంగళవారం సమీక్షించారు. మహిళాభివృద్ధి, మెప్మా, డీఆర్‌డీఏ అధికారులు అంగన్‌వాడీ సిబ్బందిని, స్వయం సహాయక సంఘాల సభ్యులను, ప్రజా ప్రతినిధులను, ఉద్యోగులను భాగస్వాములను చేస్తూ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ మాట్లాడుతూ నగరంలో నిమజ్జన ప్రాంతాలైన మానేరు నది, మానకొండూర్‌ కొత్తపల్లి, చెరువులు, చింతకుంట, కాకతీయ కెనాల్‌ ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. ఆర్డీవోలు షర్మిల, జల కుమారి పాల్గొన్నారు.

‘డబుల్‌’ కాలనీల్లో వసతుల కల్పన

డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీల్లో వసతులు కల్పించాల ని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. పూర్తయిన ఇళ్ల కాలనీల్లో తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజీలు, వీధి దీపాలు, అప్రోచ్‌ రోడ్లు వంటి వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, లోటుపాట్లు సరిచేయాలని సూచించా రు. జిల్లాలో పూర్తయిన తొమ్మిది డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాలనీల్లో వసతులను మరోసారి పరిశీలించాల ని ఆదేశించారు. 11కాలనీల్లో అసంపూర్తిగా ఉన్న పనులను గుర్తించి, పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిస్వామి, ఇన్‌చార్జి సీపీవో వీ.కిషన్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement