● 10 స్వర్ణాలు, ఒక కాంస్యంతో ప్రభంజనం ● 70వ ఎస్జీఎఫ్‌ స్టేట్‌ మీట్‌లో ఓవరాల్‌ చాంపియన్‌గా ఉమ్మడి జిల్లా | - | Sakshi
Sakshi News home page

● 10 స్వర్ణాలు, ఒక కాంస్యంతో ప్రభంజనం ● 70వ ఎస్జీఎఫ్‌ స్టేట్‌ మీట్‌లో ఓవరాల్‌ చాంపియన్‌గా ఉమ్మడి జిల్లా

Oct 14 2026 4:23 AM | Updated on Oct 14 2026 4:23 AM

● 10 స్వర్ణాలు, ఒక కాంస్యంతో ప్రభంజనం ● 70వ ఎస్జీఎఫ్‌ స్టేట్‌ మీట్‌లో ఓవరాల్‌ చాంపియన్‌గా ఉమ్మడి జిల్లా

కరీంనగర్‌స్పోర్ట్స్‌: రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా క్రీడాకారులు అజేయంగా నిలిచారు. హన్మకొండ వేదికగా జరిగిన 70వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్‌–14 బాలబాలికల జూడో టోర్నీలో కరీంనగర్‌ జట్టు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. ఏకంగా 10 బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం కొల్లగొట్టి కరీంనగర్‌ జూడో క్రీడకు కేరాఫ్‌ అడ్రస్‌ అని నిరూపించారు. అండర్‌–14 బాలుర విభాగంలో 7, బాలికల విభాగంలో 7 మొత్తం 14 వెయిట్‌ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. కరీంనగర్‌ క్రీడాకారులు 10 కేటగిరీల్లో పసిడి పతకాలను ముద్దాడారు. 10 పతకాలను కరీంనగర్‌ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు సాధించడం విశేషం. కాంస్య పతకాన్ని కరీంనగర్‌కు చెందిన మానేరు విద్యాసంస్థల విద్యార్థిని సాధించింది. క్రీడాకారులను జిల్లా క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్‌, ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్‌, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, క్రీడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌, పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి బన్సీలాల్‌, కోచ్‌లు సాయిరాం యాదవ్‌, శ్యాం కుమార్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ సత్య నారాయణ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement