కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లాసాయి పాఠశాలల అండర్–14, 17 బాలబాలికల హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహించారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి బన్సీలాల్ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక చేశారు. పెద్దపెల్లి జిల్లా పిటా సంఘం అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల సురేందర్, దాసరి రమేశ్, పోటీల కన్వీనర్ జిట్టబోయిన శ్రీనివాస్, వీరన్న, దాసరి ప్రసాద్, వీర్ పాల్, అశోక్, రాజ్ కుమార్, శ్రీనివాస్, రూపారాణి, రేణుక పాల్గొన్నారు.


