అనుమానాస్పద మృతిపై కదిలిన పోలీస్‌ యంత్రాంగం | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద మృతిపై కదిలిన పోలీస్‌ యంత్రాంగం

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

● పూడ్చిపెట్టిన మృతదేహం వెలికితీత.. పోస్టుమాఽర్టం

● పూడ్చిపెట్టిన మృతదేహం వెలికితీత.. పోస్టుమాఽర్టం

ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలకేంద్రంలో గంగాధర నడిపి లక్ష్మి (61)అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మృతురాలి అంత్యక్రియలు పూర్తయిన తర్వత ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం కావడం, ఇరుగుపొరుగు మహిళలు పోలీసులకు ఉప్పు అందించటంతో పాటు ఇదే వీధిలో ఉంటున్న సింగిరెడ్డి సరోజన ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పూడ్చిన స్థలాన్ని ఆదివారం పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై శ్రీకాంత్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, రామగుండం మెడికల్‌ కాలేజీ ఫోరెన్సిక్‌ అధికారి కార్తీక్‌ పరిశీలించారు. సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేశారు. సీఐ తెలిపిన వివరాలు.. లక్ష్మిని కుమారుడు వెంకటేశ్‌, కోడలు పుష్పలత తరచూ వేధించడంతో సింగిరెడ్డి సరోజన ఇంట్లో కిరాయికి ఉంది. కాగా, తన మనుమలను చూసుకునేందుకు కొద్దిరోజుల క్రితం సొంత ఇంటికి చేరింది. ఈ నెల 9న ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన లక్ష్మికి కోడలుతో గొడవ జరిగింది. మరుసటి రోజే మరణించడంతో చుట్టుపక్కల వారు అనుమానాలు వ్యక్తం చేశారు. లక్ష్మి మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉందని సీఐ తెలిపారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement