లేవలేం.. కూర్చోలేం! | - | Sakshi
Sakshi News home page

లేవలేం.. కూర్చోలేం!

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

చిన్న వయసులోనే కీళ్లలో అరుగుదల నిర్లక్ష్యం చేస్తే నడకకూ ఇబ్బందులే అధిక మందుల వాడినా ప్రమాదమే ముందస్తు గుర్తింపుతోనే ఉపశమనం నేడు ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం

కరీంనగర్‌: వయసు పెరిగిన తర్వాతే కీళ్ల నొప్పులు వస్తాయనుకోవడం పొరపాటు. మారుతున్న జీవనశైలి, అధిక బరువు, శారీరక శ్రమ తగ్గడం, కీళ్లపై ఒత్తిడి పెరగడం వంటి కారణాలతో చిన్న వయసులోనూ కీళ్ల సమస్యలు వేధిస్తున్నాయి. మొదట్లో స్వల్ప నొప్పిగా కనిపించినా.. క్రమంగా వాపు, బిగుతు, కదలికల్లో ఇబ్బందులు పెరిగి రోజువారీ పనులకూ ఆటంకం కలిగించవచ్చు. నడవడం, మెట్లు ఎక్కడం, కూర్చోవడం, లేవడం వంటి సాధారణ పనులు కూడా కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కీళ్ల నొప్పులను వయసుతో వచ్చే సహజ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకుండా, కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలి. సోమవారం వరల్డ్‌ ఆర్ధరైటిస్‌ డే సందర్భంగా కథనం.

ఆర్థరైటిస్‌ అంటే ఏమిటి?

కీళ్లలో నొప్పి, వాపు, బిగుతు, కదలికలు తగ్గిపోవడం వంటి లక్షణాలకు కారణమయ్యే పలు వ్యాధులను కలిపి ఆర్థరైటిస్‌ అంటారు. మోకాళ్లు, తుంటి, భుజాలు, మణికట్టు, వేళ్లు, వెన్నెముక వంటి ప్రాంతాల్లో ఈ సమస్య కనిపించవచ్చు. ఆర్థరైటిస్‌లో అనేక రకాలున్నాయి. వాటిలో ఆస్టియో ఆర్థరైటిస్‌, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ప్రధానమైనవి. ఉదయం నిద్రలేచినప్పుడు కీళ్లు బిగుసుకుపోవడం, ఎక్కువసేపు కూర్చున్న తర్వాత లేవడానికి ఇబ్బంది పడటం, నడుస్తున్నప్పుడు నొప్పి రావడం, కీలు చుట్టూ వాపు కనిపించడం వంటి లక్షణాలను గమనించాలి.

ఇమ్యూనిటీ తగ్గితే ప్రమాదం..

ఆర్థరైటిస్‌ వచ్చిందని సొంత వైద్యం చేసుకోకూడదు. వైద్యుల సూచనల మేరకే మందులు వాడాలి. ఆర్థరైటిస్‌ చికిత్సలో భాగంగా కొందరికి స్టెరాయిడ్స్‌ అవసరమవుతాయి. అయితే వీటిని అధిక మోతాదులో లేదా దీర్ఘకాలం వాడితే శరీర రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గే ప్రమాదం ఉంది. దీంతో బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం పెరుగుతుంది. అందుకే వైద్యుల పర్యవేక్షణ లేకుండా స్టెరాయిడ్స్‌ వాడరాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement