ఉక్రెయిన్‌ నుంచి మృతదేహాన్ని తెప్పించండి | - | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ నుంచి మృతదేహాన్ని తెప్పించండి

Oct 12 2026 4:01 AM | Updated on Oct 12 2026 4:01 AM

● ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించిన బాధిత కుటుంబం ● రూ.6 లక్షల ఆర్థిక సహాయానికి సీఎంకు లేఖ రాసిన మంత్రి అడ్లూరి

● ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించిన బాధిత కుటుంబం ● రూ.6 లక్షల ఆర్థిక సహాయానికి సీఎంకు లేఖ రాసిన మంత్రి అడ్లూరి

జగిత్యాలక్రైం: ఉక్రెయిన్‌లో ఉద్యోగం చేస్తూ.. సెప్టెంబర్‌ ఒకటో తేదీన రష్యా రాకెట్‌ దాడిలో మృతి చెందిన జగిత్యాల అర్బన్‌ మండలం హస్నాబాద్‌ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని బాధిత కుటుంబం కోరుతోంది. ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు రూ.6 లక్షలు అవసరమని ఇండియన్‌ ఎంబసీ సూచించడంతో ఆర్థిక సహాయం కోసం మృతుడి భార్య వావిలాల భార్గవి, తల్లి గంగు ఇటీవల హైదరాబాద్‌లోని శ్రీసీఎం ప్రవాసీ ప్రజావాణిశ్రీని ఆశ్రయించిన విషయం తెల్సిందే. దీంతో ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డి వీరి దుస్థితిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి అడ్లూరి సీఎంవో అధికారులతో మాట్లాడారు. రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement