22ఏపై సీఎం ప్రకటన.. అయినా తప్పని ఎదురుచూపులు
జిల్లాలో నిషేధిత జాబితాలో 145 సర్వే నంబర్లు సడలింపు ఇచ్చినా మారని తీరు 22 డాక్యుమెంట్లలో 14 పెండింగ్.. 8 నిలిపివేత గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధిక సమస్యలు
అమ్మా.. భవానీ
కరీంనగర్‌కల్చరల్: దేవీశరన్న నవరాత్రోత్సవాలు ఆదివారం నుంచి వైభవంగా ప్రారంభం అయ్యాయి. జిల్లావ్యాప్తంగా మండపాలు, ఆలయాల్లో దుర్గామాత కొలువుదీరారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేసి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ధ్వజారోహణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని పూజలు చేశారు. వేలాదిభవానీ దీక్షాపరుల, భక్తులు దర్శించుకున్నారు. భగత్‌నగర్‌లోని డిప్యూటీ మేయర్ క్యాంప్ ఆఫీస్ మండప వద్ద 108 కలశాలతో పూజలు నిర్వహించారు. టవర్ సర్కిల్, గణేశ్‌నగర్, చైతన్యపురి, భగత్‌నగర్ దుర్గామాత మండపాల వద్ద పూజలు వైభవంగా జరిగాయి.
డీఫాల్టర్ మిల్లు రిజిస్ట్రేషన్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వానికి రూ.కోట్ల కస్టమ్ మిల్లింగ్ ధాన్యం బకాయిలు పడి, డీఫాల్టర్లుగా మారిన కొందరు రైస్ మిల్లర్లు సేఫ్ జోన్‌లోకి వెళ్లేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వం తమ ఆస్తులను ఎక్కడ జప్తు చేస్తుందో అనే భయంతో, సివిల్ సప్లై అధికారుల కళ్లుగప్పి తమ మిల్లులను గుట్టుచప్పుడు కాకుండా ఇతరుల పేరిట బదలాయిస్తున్నారు. తాజాగా కరీంనగర్ రూరల్ మండలం గోపాల్‌పూర్‌లో వెలుగుచూసిన ఒక ఉదంతం ఇప్పుడు రెండు ప్రభుత్వశాఖల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది.
అసలేం జరిగింది?
కరీంనగర్ రూరల్ మండలం గోపాల్‌పూర్‌కు చెందిన ఓ రైస్ మిల్లు యజమాని 2022–23 రబీ సీజన్‌కు గానూ ప్రభుత్వానికి రూ.6.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. సివిల్ సప్లై అధికారులు నోటీసులు ఇవ్వడంతో కేవలం రూ.50 లక్షలు చెల్లించి, మిగతా మొత్తాన్ని ఎగ్గొట్టేందుకు ఆగస్టులో మిల్లును అమ్మకానికి పెట్టారు. రిజిస్ట్రేషన్ సందర్భంలో సివిల్ సప్లై శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌వోసీ) సమర్పిస్తేనే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా ఆయన పట్టించుకోలేదు. గతంలో సివిల్ సప్లైశాఖ ధాన్యం కేటాయించని మిల్లులకు కూడా ఎన్‌వోసీ తెమ్మని సతాయించిన రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు.. ఇంత పెద్ద బకాయి ఉన్న మిల్లర్ విషయంలో నిబంధనలు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అందిన డీఫాల్టర్ల లిస్టులో ఆ నిర్దిష్ట మిల్లు పేరు లేకపోవడంతోనే రిజిస్ట్రేషన్ చేశామని సిబ్బంది సమర్థించుకుంటున్నారు.
సబ్ రిజిస్ట్రార్లు ఎన్‌వోసీ అడగాలి
‘డీఫాల్ట్ మిల్లు డైరెక్టర్లు, పార్ట్‌నర్లు, వారి కుటుంబ సభ్యులు(లేదా) లీజుదారుల పేర్ల మీద ఉన్న ఆస్తులకు సంబంధించి లావాదేవీలను అనుమతించవద్దు. డీఫాల్ట్ రైస్ మిల్లులతో పాటు మరే ఇతర రైస్ మిల్లులకు చెందిన లావాదేవీలు జరగాలన్నా అదనపు కలెక్టర్(సివిల్ సప్లై) నుంచి బకాయిలు లేవని పేర్కొంటూ ఇచ్చే ఎన్‌వోసీని సబ్ రిజిస్ట్రార్లు తప్పనిసరిగా అడగాలి.’ అని జిల్లా రిజిస్ట్రార్‌కు రాసిన లేఖలో అడిషనల్ కలెక్టర్ (సివిల్ సప్లై) పేర్కొన్నారు.
చర్య తీసుకోవాలి
ప్రభుత్వానికి రూ.6 కోట్లకుపైగా బకాయిపడి డీఫాల్టర్‌గా తేలిన మిల్లర్ గుట్టుచప్పుడు కాకుండ మిల్లును అమ్ముకుంటుంటే ఆపాల్సిన రిజిస్ట్రేషన్ అధికారులు సహకరించడం సిగ్గుచేటు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. బాధ్యులైన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి. – పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి
కరీంనగర్ క్రైం: 22ఏ నిషేధిత జాబితా భూ యజమానులకు తీరని సమస్యగా మారింది. భూములున్నా విక్రయించుకోలేని పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రేషన్లకు అడ్డంకిగా మారింది. ఈ సమస్యతో భూ యజమానుల్లో ఆందోళన నెలకొంది. పరిష్కారం చూపుతామని గత నెల 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించడం, ప్రభుత్వం సడలింపుల మార్గదర్శకాలు జారీ చేయడంతో బాధితుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో మాత్రం ఆ ఆశలకు అనుగుణంగా ప్రక్రియ వేగం పుంజుకుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాలోని 145 సర్వే నంబర్ల పరిధిలో సుమారు 2,100 ఎకరాల భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉండగా.. సడలింపుల కింద వచ్చిన 22 డాక్యుమెంట్లలో 14 పెండింగ్‌లో ఉండడం, మరో 8 సరైన ధ్రువపత్రాల్లేక రిజిస్ట్రేషన్ నిలిచిపోవడం సమస్య తీవ్రతను ఎత్తిచూపుతోంది.
అనుమతులుంటేనే పరిశీలన
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు లేదా ఇతర సమర్థ స్థానిక సంస్థల నుంచి చెల్లుబాటయ్యే లేఅవుట్, భవన నిర్మాణం లేదా అపార్ట్‌మెంట్ అనుమతులు పొందిన ఆస్తుల విషయంలో 22ఏ అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అయితే అనుమతి ఉందన్న కారణంతో ప్రతీ ఆస్తి ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ కాదు. లింక్ డాక్యుమెంట్లు, భూమి స్వభావం, ప్రభుత్వ రికార్డులు, సంబంధిత అనుమతులు, లావాదేవీ జరిగిన తేదీ తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన షరతులన్నీ నెరవేరినప్పుడే రిజిస్ట్రేషన్‌కు అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో అర్హతున్న ఆస్తుల యజమానులు అవసరమైన రికార్డులను సమర్పించడం, వాటిని అధికారులు సకాలంలో పరిశీలించడం కీలకంగా మారింది.
22 డాక్యుమెంట్లు.. 14 పెండింగ్
ప్రభుత్వం సెప్టెంబర్ 24న జారీ చేసినట్లు పేర్కొంటున్న మెమో ద్వారా కల్పించిన సడలింపుల ఆధారంగా జిల్లాలో మొత్తం 22 డాక్యుమెంట్లు పరిశీలనకు వచ్చాయి. వీటిలో 14 డాక్యుమెంట్లు జిల్లా కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మరో 8 అవసరమైన ధ్రువపత్రాలు సరిగా లేకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. అంటే వచ్చిన దరఖాస్తుల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయి పరిష్కారం పొందినట్లు గణాంకాలు సూచించడం లేదు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? ధ్రువపత్రాల కొరతతో నిలిచిన దరఖాస్తుదారులకు ఏయే పత్రాలు అవసరమో స్పష్టంగా తెలియజేస్తున్నారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. కరీంనగర్, కరీంనగర్ రూరల్, గంగాధర, హుజూరాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 6 వరకు మొత్తం 1,682 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. సాధారణ రిజిస్ట్రేషన్ల సంఖ్యకు, 22ఏ సడలింపుల కింద పరిశీలనకు వచ్చిన డాక్యుమెంట్లకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాల్సి ఉంది. జిల్లా కమిటీ నిర్ణయం అవసరం కావడంతో ప్రక్రియలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కంటి‘పాప’ ఏడవొద్దని..
గంగాధరలో ఎక్కువ సమస్యలు
జిల్లాలోని గంగాధర సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 22ఏ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గంగాధరలో ఇటీవల 22ఏతోపాటు వివిధ రకాల సమస్యలు ఎదురవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల అమలులో జరుగుతున్న జాప్యంపై పెదవి విరుస్తున్నారు. 22ఏ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో తలెత్తే సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు పని చేయనున్నాయి. అర్హతున్న యజమానులు సంబంధిత లింక్ డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను సమర్పిస్తే నిబంధనల మేరకు పరిశీలన జరిపే అవకాశముంది. కమిటీలు పెండింగ్ దరఖాస్తులను ఎప్పటిలోగా పరిష్కరిస్తాయి? అర్హత ఉన్న భూముల విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు కాలపరిమితి విధిస్తారా? అనే ప్రశ్నలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రి ప్రకటనతో మొదలైన ఆశలు.. ప్రభుత్వ మెమోతో ఏర్పడిన వెసులుబాటు.. ఇప్పుడు జిల్లాస్థాయిలో తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉన్నాయి.


