● శిశుగృహలో చిన్నారి కంటి సమస్యను గుర్తించిన న్యాయమూర్తి ● సివిల్‌ జడ్జి యశ్వంత్‌ సింగ్‌ చొరవతో ఎల్‌వీప్రసాద్‌ ఆస్పత్రిలో చికిత్స | - | Sakshi
Sakshi News home page

● శిశుగృహలో చిన్నారి కంటి సమస్యను గుర్తించిన న్యాయమూర్తి ● సివిల్‌ జడ్జి యశ్వంత్‌ సింగ్‌ చొరవతో ఎల్‌వీప్రసాద్‌ ఆస్పత్రిలో చికిత్స

Oct 11 2026 11:49 PM | Updated on Oct 11 2026 11:49 PM

● శిశుగృహలో చిన్నారి కంటి సమస్యను గుర్తించిన న్యాయమూర్తి ● సివిల్‌ జడ్జి యశ్వంత్‌ సింగ్‌ చొరవతో ఎల్‌వీప్రసాద్‌ ఆస్పత్రిలో చికిత్స

కరీంనగర్‌ క్రైం: ఇంకా మాటలు రాని ఆరునెలల వయసున్న పసిహృదయం కంటి సమస్యతో బాధపడుతూ గుక్కపెట్టి ఏడవడాన్ని గమనించిన న్యాయమూర్తి తన పెద్ద మనసు చాటుకున్నారు. చిన్నారి ఏందుకు ఏడుస్తోందని ఆరా తీసి, సమస్యను తెలుసుకున్నారు. కంటి సమస్యతో బాధపడుతోందని గమనించి, చికిత్స అందించేందుకు చొరవ చూపారు. అవసరమైన శస్త్రచికిత్స జరిగే వరకు దగ్గరుంచి పర్యవేక్షించి ప్రశంసలు పొందుతున్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి యశ్వంత్‌ సింగ్‌. నగరంలోని శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న ఆరు నెలల చిన్నారి రిషిని గుర్తు తెలియని వ్యక్తులు కరీంనగర్‌ జీజీహెచ్‌లోని ఊయలలో వదిలేశారు. సెప్టెంబర్‌ 2న ప్రత్యేక దత్తత కేంద్రం ఆధ్వర్యంలోని అధికారులు శిశుగృహలో చేర్చారు. 18న శిశుగృహ, బాలసదన్‌ను తనిఖీ చేసిన న్యాయమూర్తి యశ్వంత్‌సింగ్‌ చాలాసేపటి నుంచి గుక్కపెట్టి ఏడుస్తున్న రిషిని గమనించారు. ఏందుకు ఏడుస్తోందని అక్క డి సిబ్బందిని ఆరా తీశారు. కంటి సమస్యతో బాధపడుతోందని చెప్పడంతో వెంటనే చికిత్సకు ఆదేశించారు. కరీంనగర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి, హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్టోబర్‌ 7న కుడికంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. 8న శిశుగృహకు తీసుకొచ్చారు. త్వరలో మరో కంటికి ఆపరేషన్‌ చేస్తామని వైద్యులు తెలిపారు. రిషినే కాకుండా మిగితా చిన్నారులపై యశ్వంత్‌ సింగ్‌ దృష్టి సారిస్తున్నారు. జిల్లా సంక్షేమ, బాలల పరిరక్షణ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement