విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలి

Oct 11 2026 11:49 PM | Updated on Oct 11 2026 11:49 PM

కరీంనగర్‌ రూరల్‌: అప్రకటిత విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని, ఎండుతున్న పంటలను కాపాడాలని ఆదివారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గోపాల్‌పూర్‌ చౌరస్తాలో రైతులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అనంతరం రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు ఎమ్మెల్యే కమలాకర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులను కరీంనగర్‌రూరల్‌ పో లీస్‌స్టేషన్‌కు తరలించారు. నాయకులు రవీందర్‌సింగ్‌, చల్లా హరిశంకర్‌, పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, సుంకిశాల సంపత్‌రావు, మంద రాజమల్లు, ఊరడి మల్లారెడ్డి పాల్గొన్నారు.

ముందస్తు గుర్తింపుతో కేన్సర్‌కు చికిత్స

కరీంనగర్‌ రూరల్‌: రొమ్ము కేన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు మహిళల ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతపై ఆదివారం ప్రతిమ మెడికల్‌ కళాశాల ఆధ్వర్యంలో కరీంనగర్‌లో వాకధాన్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్‌ అశ్వినీ తానాజీ వాకడే జెండా ఊపి వాకధాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రొమ్ము కేన్సర్‌పై మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందస్తు వ్యాధి నిర్ధారణతో తగిన వైద్యచికిత్స చేసే అవకాశం ఉందన్నారు. రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు వాకధాన్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. కరీంనగర్‌లోని ఐఎంఏ భవనం నుంచి ప్రారంభించిన వాకధాన్‌ ప్రతిమ మల్టీఫ్లెక్స్‌ మీదుగా అంబేద్కర్‌ స్టేడియం వరకు నిర్వహించారు. ఆస్పత్రి డీన్‌ జాన్‌ ఇజ్రాయిల్‌, రిజిస్ట్రార్‌ ప్రసాద్‌రావు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ సీఎన్‌ ప్రసాద్‌, ఓఎస్డీ టీకేకే నాయుడు, జనరల్‌ సర్జన్లు అరుణ్‌కఠారే, గీతారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement