17న టీటీడీ ఆలయ నిర్మాణానికి శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

17న టీటీడీ ఆలయ నిర్మాణానికి శ్రీకారం

Oct 11 2026 11:49 PM | Updated on Oct 11 2026 11:49 PM

● తిరుమల ఆలయాన్ని తలపించేలా రూపకల్పన ● వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

● తిరుమల ఆలయాన్ని తలపించేలా రూపకల్పన ● వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: నగరంలోని పద్మనగర్‌లో తిరుమల తి రుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులకు ఈ నెల 17న శ్రీకారం చుట్టనున్నారు. మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆదివారం టీటీడీ అధికారులతో కలిసి ని ర్మాణ స్థలాన్ని పరిశీలించారు. పనుల ఏర్పాట్లు, ఆలయ నమూనా అంశాలపై అధికారులతో చర్చించారు.

పది ఎకరాల్లో వైభవంగా ఆలయం

పద్మనగర్‌లో పది ఎకరాల విస్తీర్ణంలో ఆలయం నిర్మించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని తలపించేలా ప్రధాన ద్వారం, గర్భాలయం, అర్థమండపం, ముఖమండపం, గరుడాళ్వార్‌తో సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దనున్నారు.

కేసీఆర్‌ సహకారంతో అనుమతులు

కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి అనుమతులు పొందినట్లు గంగుల కమలాకర్‌ తెలిపారు. పద్మనగర్‌లో 10ఎకరాల భూమిని టీటీడీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు పేర్కొన్నారు. 2023 మే 31న భూమిపూజ నిర్వహించినట్లు గుర్తుచేశారు. అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టినప్పటికీ ఎన్నికల నేపథ్యంలో పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. అక్టోబర్‌ 17న మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటలలోపు పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆలయ నిర్మాణం పూర్తయితే కరీంనగర్‌తో పాటు పరిసర ప్రాంతాల భక్తులకు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మరింత చేరువ కానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement