పోలీస్.. రన్ ఫర్ యూత్
‘శారీరక దృఢత్వమే కాదు.. నిత్య యవ్వనం.. సంపూర్ణ ఆరోగ్యం.. శాంతిభద్రతల పరిరక్షణ.. ఇవన్నీ ఫిట్నెస్‌తోనే సాధ్యం.. అందుకు మారథాన్ మార్గం.. 21 కిలోమీటర్లు.. 42 కిలో మీటర్లే కాదు.. ఏకంగా 50 కిలోమీటర్ల దూరం వరకూ ఉత్సాహంగా పరుగెత్తడం.. యువతలో స్ఫూర్తి నింపడం ద్వారా సమాజంలో మార్పు తేవడం మా ధ్యేయం..’ అంటున్నారు ఉమ్మడి జిల్లా పోలీస్ క్రీడాకారులు.
– గోదావరిఖని
మారథాన్ పోటీలు ఎక్కడ జరిగినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసులు ఉత్సాహంగా పాల్గొంటూ అసాధారణ ప్రతిభ చూపుతున్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పట్టుదలతో లక్ష్యం సాధిస్తున్నారు. మారథాన్ అంటే కేవలం పోటీ కాదని, మనోధైర్యం, శారీరకశక్తి, క్రమశిక్షణకు మారుపేరని పేర్కొంటున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా పరుగెత్తడమే లక్ష్యంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లోనూ రాణిస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని యువతలో ఉత్సాహం రెట్టింపవుతోంది. పోలీస్ చట్టాన్ని అమలు చేయడమేకాదు.. సమాజానికి స్ఫూర్తినిస్తున్నారు.
శాంతిభద్రతల పరిక్షణ లక్ష్యం
ఆరోగ్యం.. దృఢత్వం కోసం కసరత్తు
యువతలో మార్పు తేవడమే ధ్యేయం
మారథాన్‌పై ఉమ్మడి జిల్లా పోలీసుల పట్టు
21 కే.. 42 కే.. 50 కే పరుగు పందెంలో ప్రతిభ
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వైనం
పోలీసింగ్‌తో సమాజంలో విప్లవాత్మక మార్పులు
పోలీస్.. రన్ ఫర్ యూత్
పోలీస్.. రన్ ఫర్ యూత్


