చికిత్స పొందుతూ గృహిణి మృతి
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) ఎదుట గల పొదల్లో శుక్రవారం రాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న గృహిణి చల్ల స్వప్న కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు శుక్రవారం గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాసేపటికే గోదావరిఖనిలో ఇంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పం టించుకుంది. మంటలకు ఆగలేక ఆర్తనాలు చేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. 90శాతం కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న స్వప్నను కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. మృతదేహాన్ని గోదా వరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్ధం పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనారోగ్యంతోనే స్వప్న ఆత్మహత్య చేసుకుందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని మృతురాలి తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


