శారీరక దృఢత్వం అవసరం
శారీకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు మారథాన్‌లో పాల్గొనాలి. ఊపిరితిత్తులు, గుండె, కండరాలు, మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటేనే రన్నింగ్ సాధ్యం. యువతలో స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా 25ఏళ్ల నుంచి పరుగు పందెలో పాల్గొంటున్నా. మారథాన్‌లో పాల్గొనడం ఇది 8వసారి. 47ఏళ్ల వయసు. నిత్యం పరుగెత్తకపోతే ఉత్సాహం ఉండదు. – నీలిగొండ అంజయ్య, హెడ్
కానిస్టేబుల్, రామగుండం పోలీస్ కమిషనరేట్
ముందుగానే ప్రాక్టీస్ చేశా
ఆఫ్ మారథాన్‌లో పాల్గొనేందుకు 15రోజుల ముందు నుంచి ప్రాక్టీస్ చేశా. కరీంనగర్‌లో జరిగిన మారథాన్‌లో పాల్గొన్నా. ఫుల్‌మారథాన్‌లో పాల్గొనాలని ఉంది. ఇప్పటి వరకు రెండుసార్లు ఆఫ్‌మారథాన్‌లో పాల్గొన్నా. యువతలో శారీరక ఫిట్నెస్‌తో వ్యసనాలు దూరం చేయవచ్చు.
– బుర్ర వంశీ, కానిస్టేబుల్, రామగుండం
శారీరక దృఢత్వం అవసరం


