
చికిత్స పొందుతూ ఒకరి మృతి
వెల్గటూర్: మండలకేంద్రంలో ఈనెల 2న ఏడోనంబర్ రాష్ట్ర రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న బోగ మల్లన్న (42)ను గుర్తు తెలియని వ్యక్తి బైక్‌తో ఢీకొట్టిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లన్నను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
జమ్మికుంట(హుజూరాబాద్): ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు.. మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన పంజాల సాగర్(45) కిరాణంతో పాటు, హార్వెస్టర్ నడిపిస్తాడు. మంగళవారం వరి కోసేందుకు ధర్మారం సమీపంలోని పొలం చూసేందుకు వెళ్లి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గుర్తు తెలియని రైలు ఢీకొని మృతిచెందాడు. మృతుడికి భార్య మంజుల, కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
ఎల్లారెడ్డిపేట: మండలంలోని బండలింగంపల్ల్లికి చెందిన బాల్‌రాజ్ నర్సాగౌడ్, కావ్య దంపతులపై భూవివాదంలో దాడి చేసిన వ్యక్తిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు. బండలింగంపల్లి శివారులో దంపతులు ఇద్దరు తమ వరిపొలం కోసి వడ్లను ఐకేపీ సెంటర్ వద్ద ఆరబోశారు. ఈక్రమంలో అక్కడికి వచ్చిన గ్రామానికి చెందిన బాల్‌రాజ్ నరేశ్ వారి భూమిలో తనకు వాటా ఉందని, మళ్లీ భూమి దున్నవద్దంటూ బెదిరింపులకు గురిచేశాడు. అంతేకాకుండా వారిపై బండరాయితో దాడి చేశారు. బాధితురాలు కావ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రాపెల్లి గీత ఇంట్లోకి మంగళవారం ఉదయం అక్రమంగా ప్రవేశించి, డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డ ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. గీతకు అవసరమైన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఆమె భర్త కృష్ణకాంత్‌కు పరిచయస్తులైన సిరిసిల్లకు చెందిన కుసుమ గణేశ్, గాజుల మల్లేశంను సంప్రదించారు. రూ.30వేలు ఇస్తే సర్టిఫికెట్లు ఇస్తామని నమ్మబలికి ముందస్తుగా రూ.7వేలు వసూలు చేశారు. అయినా సర్టిఫికెట్ ఇవ్వకపోగా, మిగతా డబ్బుల కోసం మంగళవారం ఇంటికొచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. భయబ్రాంతులకు గురైన గీత పక్కింటి వారిని పిలువగా పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
చొప్పదండి: వచ్చే విద్యా సంవత్సరంలో చొప్పదండి పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిది, పదకొండు తరుగతుల్లో మిగులు సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు గడువు తేదీని ఈనెల 21 వరకు పెంచినట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వివరాల కోసం నవోదయ వైబైసెట్‌ను సంప్రదించాలన్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని కరీంనగర్ వైద్య కళాశాలలో పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళావాల ప్రిన్సిపాల్ డాక్టర్ తఖీయుద్దీన్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ పారా మెడికల్ బోర్డు కార్యదర్శి నోటిఫికేషన్ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి రెండేళ్ల కోర్సులైన డిప్లమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ (డీఎంఐటీ), డిప్లొమా ఇన్ అనస్తీషియా టెక్నీషియన్ (డీఏఎన్‌ఎస్)లో చేరడానికి ఇంటర్మీడియట్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. బైపీసీలో సరిపడా విద్యార్థులు లేని సందర్భంలో ఎంపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు తమ దరఖాస్తులను బుధవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు కొత్తపల్లిలోని వైద్య కళాశాలలో సమర్పించాలని సూచించారు. నోటిఫికేషన్ వివరాల కోసం కళాశాల వెబ్‌సైట్ https://www.gmcknr.com లేదా తెలంగాణ పారా మెడికల్ బోర్డు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు.
పాలకుర్తి(రామగుండం): రామగుండం ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 24 మద్యం దుకాణాలకు 2025–27 సంవత్సరానికి ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని ఎకై ్సజ్ సీఐ మంగమ్మ తెలిపారు. వీటిలో 4 వైన్స్‌షాప్‌లు(గెజిట్ సంఖ్య 43, 45, 47, 57) గౌడ కులస్తులకు, 3 (గెజిట్ సంఖ్య 38, 39, 42) ఎస్సీలకు రిజర్వు చేశారన్నారు. ఇప్పటివరకు 2(గెజిట్ నెంబర్ 44, 56) వైన్స్‌షాప్‌లకు దరఖాస్తులు వచ్చిన ట్లు సీఐ వివరించారు. దరఖాస్తుల దాఖలుకు ఈనె 18వ తేదీ వరకు గడువు ఉందన్నారు.