
కిరాణా షాపులో చోరీ
వెల్గటూర్: మండలకేంద్రంలో తాళం వేసిన ఓ కిరా ణాషాపులో సోమవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం బాలాజీ కిరాణషాపు యజమానికి ఎప్పటిలాగే తాళం వేసి ఇంటికెళ్లాడు. సుమారు రెండు గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు షాప్ వెనుక డోర్ తాళం పగులగొట్టి కౌంటర్‌లో ఉన్న రూ.15వేలు ఎత్తుకెళ్లారు. చోరీ చిత్రాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. యజమాని ఉదయం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.