సన్నబియ్యం పక్కదారి! | - | Sakshi
Sakshi News home page

సన్నబియ్యం పక్కదారి!

Oct 8 2025 6:27 AM | Updated on Oct 8 2025 6:27 AM

సన్నబియ్యం పక్కదారి!

సన్నబియ్యం పక్కదారి!

మంథని: రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కూడా పక్కదారి పడుతోంది. పేదలు మినహా మధ్యతరగతి, ఉన్నతవర్గాలు తెల్లకార్డు ద్వారా వచ్చే సన్నబియాన్ని తిరిగి రేషన్‌ డీలర్లకే అప్పగిస్తున్నట్లు సమాచారం. దొడ్డు బియ్యం పంపిణీ చేసిన సమయంలో కిలో రూ.8 నుంచి రూ.10కు చెల్లించే రేషన్‌డీలర్లు.. సన్నబియ్యం కేజీకి రూ.12 నుంచి రూ.15వరకు కార్డుదారులకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. డీలర్ల ద్వారా సేకరించిన సబ్సిడీ బియ్యాన్ని అక్రమార్కులు మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

పెరిగిన రవాణా

సన్నబియ్యం బహిరంగ మార్కెట్‌లో కేజీకి రూ.50 నుంచి రూ.90 ధర పలుకుతోంది. దీంతో రేషన్‌ సన్నబియ్యానికి డిమాండ్‌ పెరిగింది. మంథని, గోదావరిఖని, పెద్దపల్లి సమీప ప్రాంతాల నుంచి సబ్సిడీ బియ్యం సేకరించి మహారాష్ట్రలోని సిరొంచ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం అందుబాటులోకి రావడంతో అక్రమ రవాణా అధికమైంది. ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. చాలామంది రేషన్‌కార్డుదారులు సబ్సిడి బియ్యమే తింటున్నట్లు అధికారులు, ప్రజల్ని స్మగ్లర్లు నమ్మించారు. కానీ, పేదలు మినహా, మధ్య తరగతి, ఉన్నత వర్గాలు జైశ్రీరాం బియ్యాన్ని తింటున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని ఆయా ప్రాంతాల నుంచి సేకరించి.. నిల్వ ఉంచి.. ఆ తర్వాత మినీవ్యాన్లు, లారీల్లో తరలిస్తున్నారు.

జాడలేని నిఘా..

అక్రమ దందాలకు వారధులుగా మారిన బ్యారేజీ, వంతెనల వద్ద నిఘా లేక అక్రమార్కులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీ మీదుగా మంచిర్యాల జిల్లా దాటి ప్రొఫెసర్‌జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని సరస్వతీ బ్యారేజీ, వంతెన అటు తర్వాత దామెరకుంట, కాళేశ్వరం, అంతర్‌ రాష్ట్ర వంతెన దాటి మహారాష్ట్రలోకి రేషన్‌బియ్యం చేర్చుతున్నట్లు సమాచారం.

అధికారుల ఉదాసీనతే కారణమా?

సన్నబియ్యం పక్కదారి పట్టిస్తే పీడీయాక్టు నమోదు చేస్తామని ప్రభుత్వ పెద్దలు పదేపదే చెప్పారు. కానీ, జిల్లాలో చాలాచోట్ల సబ్సిడీ బియ్యం పట్టుబడితే 6ఏ కేసుతో సరిపెడుతున్నారు. పట్టుబడిన బియ్యం ఎక్కడివి? ఎవరినుంచి రేషన్‌ డీలర్‌కు చేరాయి, వ్యాపారి ఎవరనే కోణంలో అధికారులు దృష్టి సా రించడం లేదనే విమర్శులున్నాయి. మూలాల్లోకి వె ళ్లకపోవడంతో వ్యాపారులు దందా ఆపడం లేదు. ఒకటిట్రెండు సార్లు పట్టుబడితే పీడీ యాక్టు నమోదుకు అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవ డం లేదు. కొంతమంది వ్యాపారులు బినామీల పే రిట వినియోగిస్తూ కేసులు లేకుండా జాగ్రత్తలు తీ సుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి సన్నబియ్యం అక్రమ దందాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

కార్డుదారుల నుంచి సేకరిస్తున్న రేషన్‌ డీలర్లు

కేజీకి రూ.10 నుంచి రూ.15 చెల్లిస్తున్న వైనం

పేదలు మినహా మధ్య తరగతి, ఉన్నతవర్గాల విక్రయాలు

మహారాష్ట్రకు పెరిగిన రవాణా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement