
ఏసీబీకి చిక్కిన డ్రగ్స్ శాఖ అధికారులు
కరీంనగర్‌క్రైం/కరీంనగర్‌టౌన్: కరీంనగర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకుల నుంచి రూ.20 వేలు లంచంగా తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వార్షిక తనిఖీల్లో భాగంగా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఓ ప్రైవేట్ ఫార్మసీకి వెళ్లాల్సి ఉంది. దీనికి అసిస్టెంట్ డైరెక్టర్ మరియాల శ్రీనివాసులు, డ్రగ్ ఇన్స్‌పెక్టర్ కార్తీక్ భరద్వాజ్ ప్రైవేట్ అసిస్టెంట్ అయిన పుల్లూరి రాము ద్వారా రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఫార్మసీ నిర్వాహకులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో నిఘా వేశారు. ఫార్మసీ నిర్వాహకుల నుంచి ప్రైవేట్ అసిస్టెంట్ రాము రూ.20 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శ్రీనివాసులు, కార్తీక్ భరద్వాజ్‌తోపాటు రాముపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఫార్మసీ తనిఖీకి లంచం డిమాండ్
రూ.20 వేలు తీసుకుంటుండగా పట్టివేత