
యువకుడిపై దాడి
సిరిసిల్లక్రైం: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం వెంకంపే ట ప్రాంతంలో సోమవారం పాతపగలతో జరిగిన దాడి ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాలు. వెంకంపేటకు చెందిన రాజశేఖర్‌పై అదే పట్టణానికి చెందిన హరికృష్ణ, విగ్నేశ్, నరేశ్‌లు కర్రలతో దాడి చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దాడి చేయగా అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకుండా విచక్షణారహితంగా కర్రలతో కొట్టారు. తల పై గాయాలతో రక్తస్రావమైన రాజశేఖర్ వెంటనే హాస్పిటల్‌లో చికిత్స పొంది, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ దాడితో బాధితుని ఉండే ఏరియాలో నివసించే వారు భయాందోళన చెందుతున్నారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.