
శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
అంబికా.. సెలవిక
దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా పలు చోట్ల నెలకొల్పిన దుర్గామాత విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవ కమిటీ నిర్వాహకులు, భక్తులు, భవానీ దీక్షాపరులు అమ్మవారి విగ్రహాలను వాహనాల్లో మానకొండూరు, మానేరు వాగు, కొత్తపల్లి, చింతకుంట, దుర్శేడ్, బొమ్మకల్ చెరువులకు తరలించారు. చైతన్యపురి మహాశక్తి ఆలయంలో అ మ్మవారి నిమజ్జనం వైభవంగా జరిగింది. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. యువత ఉత్సాహంగా దాండియా ఆడిపాడారు. నగరంలోని విగ్రహాలు రాజీవ్ చౌక్, పోస్టాఫీస్ చౌరస్తా, టవర్, కమాన్ ద్వారా నిమజ్జనానికి తరలాయి. దారి పొడవునా భక్తులు అమ్మవారికి మంగళహారతులతో నీరాజనం పలికారు.
– కరీంనగర్ కల్చరల్

శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025