కుటుంబ అండదండలతో.. | - | Sakshi
Sakshi News home page

కుటుంబ అండదండలతో..

Sep 26 2025 6:38 AM | Updated on Sep 26 2025 1:45 PM

కుటుంబ అండదండలతో..

కుటుంబ సభ్యులతో శివశంకర్‌వరప్రసాద్‌

గోదావరిఖని/గోదావరిఖనిటౌన్‌: గోదావరిఖనికి చెందిన సింగరేణిలో ఓసీపీ ఈపీ ఆపరేటర్‌ తుంగపిండి ఆనంద్‌ కొడుకు తుంగపిండి శివశంకర్‌ప్రసాద్‌ 448 ర్యాంక్‌తో అసిస్టెంట్‌ ట్రెజరరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. ప్రాథమిక విద్య సింగరేణిప్రాంతంలోనే పూర్తి చేసిన శివశంకర్‌ప్రసాద్‌ ఇంటర్‌ కరీంనగర్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత రెండేళ్ల పాటు గ్రూప్స్‌, సివిల్స్‌ కోసం ప్రయత్నించారు. 

ఇంతలోనే గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ రావడంతో ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగం సాధించారు. శివశంకర్‌ప్రసాద్‌ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల అండదండలతోనే ఈ విజయం సాధించానని, గ్రూప్‌–1 ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ కావడమే తన జీవిత లక్ష్యమన్నారు. తన ఎదుగుదలలో అమ్మానాన్నల పాత్ర అమోఘమని, వారికి రుణపడి ఉంటానన్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement