
దసరాలోపు డీలర్ల కమీషన్ వచ్చేలా చర్యలు
కరీంనగర్ అర్బన్: రేషన్ డీలర్లకు దసరాలోపు కమీషన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఐదు నెలల కేంద్ర కమీషన్ డబ్బులు రావాల్సి ఉందని రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో మంత్రిని కలిసి వివరించారు. మంత్రి స్పందిస్తూ వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. సదరు సమస్యను పండుగలలోపు పరిష్కరించాలని సూచించారు. డీలర్ల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు బత్తుల రమేశ్ బాబు రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్‌లో పరిస్థితిని వివరించారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రొడ్డ శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హన్మాండ్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతరాజు రమేశ్, చిలగాని మోహన్ పాల్గొన్నారు.
ఎల్‌వోసీఎఫ్‌ను వ్యతిరేకించండి
కరీంనగర్: యూజీసీ విడుదల చేసిన ఎల్‌వోసీఎఫ్‌ను వ్యతిరేకించాలని, శాసీ్త్రయ విద్యావిధానం అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్య క్ష, కార్యదర్శులు ఎస్.రజినీకాంత్, టి.నాగరాజు డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యూజీసీ గైడ్‌లెన్స్‌కు వ్యతిరేకంగా గురువారం కోతిరాంపూర్‌లో నిరసన తెలిపారు. యూజీసీ విడుదల చేసిన ఆదిమ, అశాసీ్త్రయ అభ్యాస ఫలితాల ఆధారిత పాఠ్య ప్రణాళిక చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం జరుగుతోందన్నారు. క్యాంపస్‌ల శాసీ్త్రయ దృక్పథాన్ని స్తంభింపజేసే ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు ఎదురవుతాయన్నారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పూజ, కిరణ్, శంకర్, సహాయ కార్యదర్శి మమత, గజ్జెల శ్రీకాంత్, ప్రశాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరవింద్, విఘ్నేశ్ పాల్గొన్నారు.
లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
కరీంనగర్ టౌన్: ప్రభుత్వం అమలు చేస్తున్న లింగనిర్ధారణ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. జిల్లాలో లింగనిర్ధారణ నిషేధ చట్టం అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అతిక్రమిస్తే నేరుగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. జిల్లాలో అనుమతి పొందిన స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేస్తున్నామని వెల్లడించారు. డాక్టర్లు సనా జవేరియా, ఉమాశ్రీ, చందు, డెమో రాజగోపాల్ పాల్గొన్నారు.
29న సద్దులు.. గ్రామాల్లో నిర్ణయం
కరీంనగర్‌రూరల్: బతుకమ్మ పండుగ నిర్వహణపై ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కో క్యాలెండర్‌లో ఒక్కో తేదీ ఉండటంతో బతుకమ్మ పండుగను ఎప్పుడు జరుపుకోవాలో తెలియక ఆయోమయానికి గురవుతున్నారు. ఒక గ్రామంలో ఈ నెల 29న అంటే మరోగ్రామంలో 30న నిర్వహించుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లో గురువారం అధి కారులతో కలిసి గ్రామపెద్దలు బతుకమ్మ పండుగ నిర్వహణపై అర్చకుడు సత్యనారాయణ చార్యులతో చర్చించారు. 29న బతుకమ్మ, అక్టోబరు 2న దసరా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు తీర్మానం చేసి అన్ని కులసంఘాల ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు.

దసరాలోపు డీలర్ల కమీషన్ వచ్చేలా చర్యలు

దసరాలోపు డీలర్ల కమీషన్ వచ్చేలా చర్యలు

దసరాలోపు డీలర్ల కమీషన్ వచ్చేలా చర్యలు