
వాననీళ్లు నిలవకుండా చర్యలు
కరీంనగర్ కార్పొరేషన్: వరుసగా వర్షాలు కురుస్తున్నందున, నగరంలో ఎక్కడా వర్షపు నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం పారిశుధ్య విభాగ అధికారులతో నగరపాలకసంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. ఫుట్‌పాత్ హోల్స్‌లో చెత్త పేరుకు పోకుండా చర్యలు చేపట్టాలన్నారు. వర్షం నీళ్లు రోడ్లపై నిల్వకుండా డ్రైనేజీల్లోకి వెళ్లేలా చూడాలన్నారు. బయోగ్యాస్ ప్లాంట్, కొత్త డీఆర్ సీసీలు, వర్మీ కంపోస్ట్ పిట్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. పారిశుధ్య వాహనాల పార్కింగ్‌కు పరిశీలించిన స్థలంలో నూతన వెహికిల్ షెడ్ నిర్మించాలన్నారు. డంపింగ్ యార్డులో వాహనాలు సులువుగా వెళ్లేందుకు సీసీ రోడ్లు నిర్మించాలన్నారు. స్వచ్ఛ ఆటోలు ప్రతి ఇంటికి వెళ్లాలని, యూజర్ చార్జీలు వసూలు చేసేలా వార్డు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొహియుద్దీన్, సహాయ కమిషనర్ దిలీప్ కుమార్, ఎంహెచ్ సుమన్ పాల్గొన్నారు.