లిక్కర్‌..టెండర్‌ | - | Sakshi
Sakshi News home page

లిక్కర్‌..టెండర్‌

Sep 26 2025 7:11 AM | Updated on Sep 26 2025 7:11 AM

లిక్కర్‌..టెండర్‌

లిక్కర్‌..టెండర్‌

నేటి నుంచి నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానం వచ్చే నెల 18వ తేదీ వరకు స్వీకరణ 23న లక్కీ డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు జనాభాకు అనుగుణంగా స్లాబ్‌ రుసుం

ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ఇలా

షాపులు దరఖాస్తులు (రూ.కోట్లల్లో)

సాక్షి పెద్దపల్లి/కరీంనగర్‌క్రైం:

ద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు లక్కీ డ్రా ద్వారా సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా దుకాణాలు కేటాయించారు. శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న వైన్స్‌ కాలపరిమితి నవంబర్‌ 30తో ముగియనుండగా రెండు నెలల ముందుగానే ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించింది. దీంతో ప్రస్తుతం మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులతో పాటు గతంలో లక్కీడ్రాలో అదృష్టం వరించని వారు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమతున్నారు. లైసెన్స్‌ కాలం 01.12.2025 నుంచి 30.11.2027 వరకు నిర్ణయించారు. ఈ ఏడాది స్థానిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మద్యం విక్రయాలు భారీస్థాయిలో ఉండే అవకాశముంది. దీంతో గతం కన్నా పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎకై ్సజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో 287 మద్యం దుకాణాలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 287 మద్యం దుకాణాలు ఉన్నాయి. మద్యంషాపుల్లో రిజర్వేషన్‌ ప్రకారం.. గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం దుకాణాలను కేటాయించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎస్టీ జనాభా తక్కువగా ఉండటంతో షాపులు కేటాయించలేదు. దీంతో 53 షాపులను గౌడ్స్‌, 31 దుకాణాలు ఎస్సీలకు కేటాయించారు. మిగిలిన అన్ని షాపులను ఆన్‌రిజర్వ్‌ కేటగిరీలో చేర్చారు. దీంతో ఈ దుకాణాలకు ఏ సామాజికవర్గం వారైనా టెండర్‌ దాఖలు చేయవచ్చును.

ఒక్కో దుకాణానికి రూ.3 లక్షల ఫీజు

ఉమ్మడి జిల్లాలోని ఒక్కో వ్యక్తి ఒక్కో దుకాణానికి ఎన్ని దరఖాస్తులనైనా సమర్పించవచ్చు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో ఏ మద్యం దుకాణానికై నా టెండర్‌ వేయవచ్చు. ఒక్కో దరఖాస్తుకు గతంలో రూ.2లక్షలు (నాన్‌ రిఫండెబుల్‌) ఉండగా, ఈసారి ఆ ఫీజును రూ.3లక్షలకు పెంచారు. గతేడాది ఉమ్మడి జిల్లాలో 10,734 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి టెండర్ల ద్వారా రూ.214.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి ఫీజు పెరగటంతో ఆదాయం మరింత పెరగనుంది. దరఖాస్తు ఫీజును డీడీగా, చలాన్‌ రూపంలోగాని చెల్లించవచ్చు. దరఖాస్తులను ఆయా జిల్లా ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.

ఆరు శ్లాబుల్లో

లైసెన్స్‌ల జారీ..

మొత్తం ఆరు శ్లాబుల్లో ఎకై ్సజ్‌శాఖ లైసెన్స్‌లు జారీ చేయనుంది. 2011 జనాభా లెక్క ప్రకారం 5వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి ఎక్సైజ్‌ ట్యాక్స్‌ రూ.50 లక్షలు, 5వేల నుంచి 50 వేలు జనాభా ఉన్న పాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి 1 లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలు, ఇక 20 లక్షలపైన జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి ఎకై ్సజ్‌ ఫీజు రూ.కోటి పది లక్షలుగా నిర్ణయించారు. అయితే, లాటరీ ద్వారా లిక్కర్‌ షాపులను పొందిన వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వార్షిక ఫీజును ప్రతి ఏటా ఆరు స మాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 25 నెలల లైసెన్స్‌ కాలానికి గాను 1/4వ వంతు అంటే 25 శాతం సమానమైన బ్యాంక్‌ గ్యారంటీ ప్రభుత్వానికి సమర్పించాలి.

జిల్లా మొత్తం గౌడ్స్‌కు ఎస్సీలకు గతంలో వచ్చిన వచ్చిన ఆదాయం

కరీంనగర్‌ 94 17 9 4,040 80.80

జగిత్యాల 71 14 8 2,636 52.72

పెద్దపల్లి 74 13 8 2,022 40.44

సిరిసిల్ల 48 09 6 2,036 40.72

మొత్తం 287 53 31 10,734 214.68

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement