
కొత్త వైన్స్‌లకు గెజిట్ విడుదల
కరీంనగర్‌క్రైం: జిల్లావ్యాప్తంగా 94 వైన్స్‌లకు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం గెజిట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ భవన్‌లో ఆయన మాట్లాడు తూ 94 దుకాణాల్లో గౌడ్స్‌కు 17, ఎస్సీలకు 9షాపులు రిజర్వేషన్ ద్వారా కేటాయించినట్లు తెలిపారు. వైన్స్ టెండర్లకు 18 అక్టోబర్ వరకు గడువు ఉండగా 23న కలెక్టరేట్‌లో లక్కీ డ్రా ద్వారా షాపులు కేటా యించనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం వైన్స్‌లకు రూ.3లక్షలు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. కరీంనగర్‌లోని అర్బన్ ఎకై ్సజ్ కార్యాలయంలో ధరఖాస్తులు స్వీకరిస్తామని, హైదరాబాద్‌లోని నాంపల్లి ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయంలో కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం సూచించి న విధంగా కరీంనగర్ అర్బన్ పరిధిలో మొత్తం 21 షాపులుండగా గౌడ్స్‌కు 03, ఎస్సీలకు 04, కరీంనగర్ రూరల్ పరిధిలో 26 షాపులుండగా గౌడ్స్‌కు 04, ఎస్సీలకు 01, తిమ్మాపూర్ సర్కిల్‌పరిధిలో 14 షాపులుండగా గౌడ్స్‌కు 3, ఎస్సీలకు 2 కేటాయించారని, హుజూరాబాద్ సర్కిల్‌లో 17 దుకాణాలుండగా గౌడ్స్‌కు 05, ఎస్సీలకు 01, జమ్మికుంట సర్కిల్‌లో గౌడ్‌లకు 02, ఎస్సీలకు 01 దుకాణాలు కేటాయించారని తెలిపారు.
డివిజన్ ఒక్కటే కావడంతో ఇబ్బందులు
కరీంనగర్ రూరల్ పరిధిలో పలు దుకాణాలకు ప్రత్యేకంగా కేటాయింపు ఉండడంతో ఎక్కడికక్కడే టెండర్లు వేసేవారు. ఇప్పుడు రూరల్ పరిధిలోని వి విధ గ్రామాలు, కొత్తపల్లి మండలం పలు గ్రామాలు కలిపి ఒకే డివిజన్‌లో ఉండడంతో వైన్స్ వచ్చిన వారు ఎక్కడయినా షాపు పెట్టుకునే అవకాశాలు ఉండడంతో నష్టం జరిగే అవకాశాలుంటాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.