
రేడియేషన్ అంకాలజీలో విప్లవాత్మక మార్పులు
● యశోద హాస్పిటల్ రేడియేషన్ అంకాలజిస్టు సునీత
కరీంనగర్‌టౌన్: ఎంఆర్ లినాక్‌తో పేషెంట్‌కు రేడియేషన్ తగ్గించి చికిత్స అందించవచ్చని, ఇది దేశంలో ఎక్కడా లేదని, మొట్టమొదటి యంత్రం యశోద ఆసుపత్రి హైటెక్‌సిటీలో ఉందని రేడియేషన్ అంకాలజిస్టు డాక్టర్ సునీత తెలిపారు. శుక్రవారం నగరంలోని యశోద మెడికల్ సెంటర్‌లో మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ ఎంఆర్ లినాక్ ఎంఆర్‌ఐ స్కానర్‌తో రోగికి ఖచ్చితమైన చోటనే రేడియేషన్ కిరణాలు ప్రసరించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవన్నారు. ఇప్పటి వరకు సుమారు 300 మందికి ఈ ఎంఆర్ లినాక్ చికిత్స అందించామని తెలిపారు. మెదడు, కణితులు, ప్రొస్టేట్ కేన్సర్, తల, మెడ కేన్సర్, సీ్త్రలకు సంబంధించి సర్వైకల్ కేన్సన్, గర్భాశయ కేన్సర్, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర కేన్సర్‌లకు రేడియేషన్ సోకకుండా ఎంఆర్ లినాక్ ద్వారా చికిత్స అందించవచ్చని తెలిపారు. ఎంఆర్ లినాక్‌తో చికిత్స పొందడం కోసం ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆసుపత్రి మేనేజర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.