
నెల రోజులకో పంట
నాలుగు ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నాను. ఆరేళ్ల క్రి తం వరకు వరి, మొక్కజొన్న వేసేవాడిని. ప్రత్యామ్నాయ పంటలుగా మల్బరీ వేశాను. ప్రభుత్వ సహకారంతో షెడ్డు నిర్మించాను. నాలుగు బ్యాచుల్లో నష్టం వచ్చింది. మెలకువలు నేర్చుకున్నాక నెలరోజులకో బ్యాచ్ తీస్తున్నాను. నెలలో ఖర్చులు పోను రూ.50వేల వస్తుంది.
– రాజేందర్‌శర్మ, మల్బరీ రైతు, గూడూరు
మూడేళ్ల క్రితం వరకు వరిపంట సాగుచేసిన. ప్రభుత్వ ప్రోత్సాహంతో మూడు ఎకరాల్లో మల్బరీ వేసి, షెడ్డు నిర్మించాను. చిన్నపిల్లలను పోషించినట్లుగా పట్టు పురుగుల పెంపకం చేపడితే మంచి లాభాలు వస్తాయి. పట్టుకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. నెల రోజుల్లో ఒక బ్యాచ్ తీయవచ్చు.
– కనమేని లింగారెడ్డి, రైతు, ముస్తాబాద్

నెల రోజులకో పంట