కరీంనగర్/కరీంనగర్‌టౌన్/కరీంనగర్‌క్రైం: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని, ఆమె పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కొనియాడారు. జిల్లావ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, రజక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేశ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు కొత్తకొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీసు కమిషనరేట్‌లో సీపీ గౌస్‌ఆలం చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు మాధవి, యాదగిరిస్వామి పాల్గొన్నారు.
శనివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
శనివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025