
కొత్త లే అవుట్లు ఏర్పాటు చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: సుడా పరిధిలో కొత్తగా లే అవుట్లు ఏర్పాటు చేయలని చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. శాతవాహన అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ సమీక్ష గురువారం నగరంలోని కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన లే అవుట్లకు గతంలో గుర్తించిన ప్రాంతాలపై కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ నివేదిక తయారు చేసిందని తెలిపారు. కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. నగరంలో మిగిలిపోయిన కూడళ్ల సుందరీకరణ పనులు చేపట్టనున్నామన్నారు. సుడా కమర్షియల్ భవనం, ఐడీఎస్‌ఎంటీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చొక్కారావు జంక్షన్ ప్రక్కన ఉన్న కూడలిని సుందరీకరించాలని సూచించారు.మెయిన్ రోడ్లలోని నాలాల బ్రిడ్జిలపై హైదరాబాద్ తరహాలో ప్లాంట్స్‌తో సుందరీకరించాలన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని కొక్కెరకుంట,కోనాయపల్లి రోడ్డుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. సుడా వైస్ చైర్మన్ ప్రఫుల్ దేశాయ్, సీపీవో ఆంజనేయులు, ఎస్‌ఈ రాజ్ కుమార్, ఈఈ రొడ్డ యాదగిరి, డీఈ రాజేంద్ర ప్రసాద్, టీపీవో శ్రీధర్ ప్రసాద్, టీపీఎస్ సంధ్య, అజ్మల్ పాల్గొన్నారు.