
తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు కౌన్సెలింగ్
వీణవంక: తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు వీణవంక మండలం బేతిగల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామానికి చెందిన కంబాల రాయమల్లు– చెన్నమ్మలకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కొడుకులు పోషించడం లేదని ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ ఆర్డీవో రమేశ్‌బాబు కౌన్సెలింగ్ ఇచ్చి నెలకు ఒక్కొక్కరు రూ.4వేల చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. ఆర్డీవో ఆదేశాలను అమలు చేస్తున్నారా లేదా అని గురువారం జిల్లా సంక్షేమ ఆధికారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో విచారించారు. ఇద్దరు కుమారులు పోషించడంలేదని తల్లిదండ్రులు చెప్పడంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల పోషణను చూసుకోవాలని చెప్పడంతో పాటు రూ.16వేలు ఇప్పించారు. ఆర్‌ఐ రవి, డీవీసీ కౌన్సిలర్ పద్మావతి, సాయికిరణ్, వినోద్, ఆంజనేయులు ఉన్నారు.