
జాతీయజెండాకు అవమానం
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలలో జాతీయ పతాకా నికి అవమానం జరి గింది. ప్రజా పాలనలో భాగంగా బుధవా రం ఉదయం హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు కన్నం రమేశ్ జెండాను ఆవి ష్కరించారు. సూర్యస్తమయానికి ముందు జాతీయ పతాకా న్ని గౌరవంగా దింపాలి. కానీ నిర్లక్ష్యంగా వదిలేశారు. కొత్తపల్లి పట్టణానికి చెందిన వాక ర్స్ గురువారం ఉదయం గమనించి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు. విషయం ప్రచారమవుతుండటంతో పాఠశాలలోని ఓ విద్యార్థితో దింపించారు. దీనిపై మండల విద్యాధికారి తుమ్మ ఆనందంను వివరణ కోరగా జాతీయ పతాకాన్ని దింపడంలో నిర్లక్ష్యం వహించిన అటెండర్లకు మెమోలు జారీ చేశామన్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం హెచ్‌ఎం పాఠశాలల సందర్శన, మేళాకు వెళ్లడం జరిగిందని, పీఈటీ సెలవులో ఉండటంతో అటెండర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మెమోలిచ్చినట్లు పేర్కొన్నారు.
పత్తి సేకరణకు ఏర్పాట్లు చేయండి
కరీంనగర్ అర్బన్: జిల్లాలో పత్తి సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 44,885 ఎకరాల్లో పత్తి సాగైందని, 5,38,620 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని తెలిపారు. జిల్లాలో కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని 15 జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. పత్తి కొనుగోళ్లకు రైతుల ఆధార్ ప్రామాణికమని, రైతులు తమ బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం, కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకునే విధంగా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా మార్కెటింగ్ అధికారి షాబుద్దీన్, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
‘కందుకూరి’కి ధర్మనిధి సాహిత్య పురస్కారం
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు కందుకూరి అంజయ్య తెలంగాణ సారస్వత పరిషత్తు వారి ధర్మనిధి సాహిత్య పురస్కారం– 2025ను అందుకున్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ధర్మనిధి సాహిత్య పురస్కారాల్లో ఒకటైన డాక్టర్ రావికంటి వసునందన్ సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, జుర్రు చెన్నయ్య, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్.రాములు అవార్డు అందించారు. కవులు నలిమెల భాస్కర్, అన్నవరం దేవేందర్, కూకట్ల తిరుపతి, గాజోజు నాగభూషణం, బూర్ల వెంకటేశ్వర్లు అభినందించారు.

జాతీయజెండాకు అవమానం

జాతీయజెండాకు అవమానం