రేషన్‌షాపుల్లోనే దొడ్డుబియ్యం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌షాపుల్లోనే దొడ్డుబియ్యం

Sep 19 2025 2:11 AM | Updated on Sep 19 2025 2:11 AM

రేషన్‌షాపుల్లోనే దొడ్డుబియ్యం

రేషన్‌షాపుల్లోనే దొడ్డుబియ్యం

పెగడపల్లి: మండలంలోని రేషన్‌ దుకాణాల్లో క్వింటాళ్ల కొద్ది దొడ్డు బియ్యం మూలుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తున్న విషయం తెల్సిందే. అయితే అప్పటికే దుకా ణాల్లో నిల్వ ఉన్న దొడ్డుబియ్యం అలాగే ఉండిపోయాయి. ఆ బియ్యం ఎలుకలు, పందికొక్కులకు ఆహారంగా మారుతున్నాయి. ఆర్నెళ్ల క్రితం రేషన్‌ దుకాణాలకు చేర్చిన దొడ్డుబియ్యాన్ని తిరిగి గోదాములకు పంపించాల్సి ఉండగా.. పట్టించుకునేవారు లేకపోవడంతో అలాగే ఉండిపోతున్నాయి. ఏ దుకాణంలో చూసినా 15 నుంచి 20 క్వింటాళ్లు వరకు నిల్వలు పేరుకుపోయాయి. మరోవైపు సన్యబియ్యం స్టాక్‌ వస్తే ఇబ్బందిగా ఉందని, అధికారులు స్పందించి దొడ్డు బియ్యాన్ని గోదాములకు తరలించాలని డీలర్లు కోరుతున్నారు. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్‌ లాస్యశ్రీని వివరణ కోరగా దొడ్డ బియ్యం నిల్వలపై ఉన్నతాధికారులు, సివిల్‌ సప్‌లై అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement