
భారీ స్కాలర్‌షిప్‌తో ‘అల్ఫోర్స్ అటెమ్ట్– 2025’
● రూ.54,44,444 స్కాలర్‌షిప్ పోస్టర్‌ను ఆవిష్కరించిన చైర్మన్ నరేందర్ రెడ్డి
కొత్తపల్లి(కరీంనగర్): అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి 25 తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో రెండేళ్లపాటు ఇవ్వబడే ఐఐటీ/నీట్ శిక్షణలో రాయితీ పొందడానికి స్కాలర్‌షిప్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో గురువారం అటెమ్ట్–2025 వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు 35ఏళ్లుగా రాష్ట్ర విద్యారంగానికి చేయూతనివ్వడంతో పాటు ఎంతోమంది విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పదోతరగతి విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ చూపిన వారికి సుమారు రూ.54,44,444 విలువగల స్కాలర్‌షిప్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 91335 37444/ 91602 94441/92469 34456/92469 34441 సెల్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.